ETV Bharat / state

Kishan Reddy:'భాజపా అధికారంలోకి వచ్చిన వెంటనే తొలిసంతకం దానిపైనే'

భాజపా అధికారంలోకి వచ్చిన వెంటనే అక్టోబర్‌ 17ను తెలంగాణ విమోచన దినం నిర్వహించాలని తొలి సంతకం చేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యక్రమంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

bjp
bjp
author img

By

Published : Sep 17, 2021, 9:33 AM IST

Updated : Sep 17, 2021, 2:43 PM IST

భాజపా అధికారంలోకి వచ్చిన మరుక్షణమే అక్టోబర్‌ 17ను తెలంగాణ విమోచన దినం నిర్వహించాలని తొలి సంతకం చేస్తామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణ ప్రజలు స్వచ్ఛ వాయువులు పీల్చుకున్న ఈ రోజు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అగౌరపరుస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యక్రమంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఎంఐఎం పార్టీ మెప్పు కోసమే విమోచన దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం లేదని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు.

బర్కత్​పురలోని భాజపా నగర కార్యాలయంలో

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్​ బర్కత్​పురలోని భాజపా నగర కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భాజపా సెంట్రల్​ జిల్లా అధ్యక్షుడు గౌతమ్​రావు జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రరావు, అంబర్​పేట నియోజకవర్గ కార్పొరేటర్లు, భాజపా ముఖ్యనాయకులు పాల్గొన్నారు.

కేసీఆర్​ ప్రజలకు ఇచ్చిన మాట, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా... అనేక మంది పోరాటం చేసి అమరులైన వారి ఆత్మకు శాంతి చేకూరే విధంగా... తెరాస ప్రభుత్వం చేసిన తప్పును తెలుసుకుని సెప్టెంబర్​ 17న తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించాలి. మజ్లిస్​పార్టీ చేతిలో కీలుబొమ్మగా ఉంటూ ఈరోజు కేసీఆర్​ కుటుంబం గత ఏడేళ్లుగా తెలంగాణలో పరిపాలన చేస్తోంది. -కిషన్​ రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి

ఆనాటి రజాకార్లకు వారసులైనటువంటి మజ్లిస్​ పార్టీ ఒత్తిడికి తలొగ్గి గత పాలకులు పాలన చేశారు. ఆ చరిత్ర వెలుగులోకి వస్తే మజ్లిస్​ పార్టీకి మనుగడ ఉండదనే ఆలోచనతో కేవలం అధికారం కోసం, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజల త్యాగాలను ఏ విధంగా కనుమరుగు చేస్తున్నారో చూపించేందుకు భాజపా 20 ఏళ్లుగా పోరాటం చేస్తోంది. -లక్ష్మణ్‌, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు.

Kishan Reddy:'భాజపా అధికారంలోకి వచ్చిన వెంటనే తొలిసంతకం దానిపైనే'

ఇదీ చూడండి: BJP: నేడే నిర్మల్​లో భాజపా భారీ బహిరంగ సభ.. కేంద్రమంత్రి అమిత్​ షా రాక

Last Updated : Sep 17, 2021, 2:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.