ETV Bharat / state

'రాష్ట్ర శాసనసభ సమావేశాలు నిరాశను మిగిల్చాయి' - hyderabad latest news

తెలంగాణ శాసనసభ సమావేశాలు అందరికి నిరాశను మిగిల్చాయని తేదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. 2017-18లో 2 లక్షల 72 వేల 763 డబుల్ బెడ్‌ రూం ఇళ్లను ప్రారంభిచామని, నిన్న కాక మొన్న బడ్జెట్​లో కూడా అదే అంకెను చదివారని అన్నారు. ఏ రకంగా మార్పులు జరగలేదన్నారు.

ravula
ravula
author img

By

Published : Mar 16, 2020, 7:50 PM IST

రాష్ట్ర శాసనసభ సమావేశాలు పేదలకు, బడుగు బలహీనవర్గాలతోపాటు విద్యార్థులు రైతులకు నిరాశను మిగిల్చాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆ వర్గాలకు గత కేటాయింపు కంటే... అదనంగా ఏమీ చేయలేదని పేర్కొన్నారు.

2017-18లో 2,72,763 డబుల్ బెడ్‌ రూం ఇళ్లను ప్రారంభిచామని, నిన్న కాక మొన్న బడ్జెట్​లో కూడా అదే ఫిగర్​ను చదివారని వివరించారు. డబుల్ బెడ్‌ రూం ఇళ్లను పూర్తి చేయకుండా బలహీన వర్గాల ఆశల మీద నీళ్లు చల్లారని రావుల విమర్శించారు. రాజీవ్ స్వగృహ ఇళ్లకు ఎప్పుడూ మోక్షం లభిస్తుందో తెలియని పరిస్థితి ఉందని దుయ్యబట్టారు. పేదలకు ఇళ్లు అందని ద్రాక్షలా మిగిలిపోయాయని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ కలల ప్రాజెక్టు డబుల్ బెడ్​రూం ఇళ్లు, పడుకుని కలల్లోనే చూసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం చేతులేత్తిసిందన్నారు. నిరుద్యోగ భృతి విషయంలో ఈ సంవత్సరం దాని ఊసే ఎత్తలేదన్నారు. పేదలకు మూడెకరాల భూపంపిణీ పథకం ముందుకు సాగే పరిస్థితి కనిపించడంలేదన్నారు.

'రాష్ట్ర శాసనసభ సమావేశాలు నిరాశను మిగిల్చాయి'

ఇదీ చూడండి : తెలుగు రాష్ట్రాల విద్యుత్‌ సంస్థల్లో మళ్లీ లొల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.