ETV Bharat / state

Council Chairman: మండలి ఛైర్మన్​ పదవి ఎన్నికకు అనుమతిస్తూ గవర్నర్​ ఆమోదం - ts news

Council Chairman: ఖాళీగా ఉన్న ఛైర్మన్ పదవికి ఎన్నికకు అనుమతిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. అందుకు అనుగుణంగా ఎన్నిక తేదీని ఖరారు చేసి సభ్యులకు సమాచారం ఇవ్వనున్నారు. ఛైర్మన్​ను ఎన్నుకునేందుకు సోమవారం ఎన్నిక నిర్వహించనున్నారు.

Council Chairman: మండలి ఛైర్మన్​ పదవి ఎన్నికకు గవర్నర్​ ఆమోదం

author img

By

Published : Mar 11, 2022, 4:20 AM IST

Council Chairman: శాసనమండలి ఛైర్మన్ ఎన్నిక కోసం ఇవాళ ఎమ్మెల్సీలకు సమాచారం పంపనున్నారు. ఖాళీగా ఉన్న ఛైర్మన్ పదవికి ఎన్నికకు అనుమతిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. అందుకు అనుగుణంగా ఎన్నిక తేదీని ఖరారు చేసి సభ్యులకు సమాచారం ఇవ్వనున్నారు. ఛైర్మన్​ను ఎన్నుకునేందుకు సోమవారం ఎన్నిక నిర్వహించనున్నారు. ఎన్నిక కోసం ముందురోజు ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ మేరకు ఎన్నిక తేదీలు, సమాచారం, ప్రక్రియను వివరిస్తూ అధికారులు ఇవాళ ఎమ్మెల్సీలకు సమాచారమిస్తూ లేఖలు పంపనున్నారు.

అటు మండలి ఛైర్మన్ పదవికి గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఖరారు చేశారు. గతంలో మండలి ఛైర్మన్​గా బాధ్యతలు నిర్వర్తించిన సుఖేందర్ రెడ్డి... ఇటీవల శాసనసభ కోటా నుంచి మళ్లీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయనకు మరోమారు మండలి ఛైర్మన్​గా బాధ్యతలు అప్పగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఛైర్మన్ ఎన్నిక అనంతరం డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక కూడా చేపట్టే అవకాశం ఉంది. డిప్యూటీ ఛైర్మన్​గా బండా ప్రకాశ్​కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.