ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్, పీజీఎల్ సెట్‌లో 76.87 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. లాసెట్, పీజీఎల్ సెట్ ఫలితాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. మూడేళ్ల ఎల్ఎల్బీలో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్ 15 వేల 398 మంది రాయగా.. 78.60 శాతంతో 12 వేల 103 మంది ఉత్తీర్ణులయ్యారు. ఐదేళ్ల ఎల్ఎల్బీ కోసం జరిపిన లాసెట్‌కు 5 వేల 677 మంది హాజరు కాగా.. వారిలో 62.35 శాతం 3 వేల 973 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీ ఎల్ సెట్ 2 వేల 188 మంది రాయగా.. 91.04 శాతంతో 1992 మంది ఉత్తీర్ణత సాధించారు. మూడేళ్ల లాసెట్‌లో కూకట్ పల్లికి చెందిన సీహెచ్ స్నేహశ్రీ, ఐదేళ్ల లాసెట్‌లో కరీంనగర్ విద్యార్థి ఎస్ఎస్ కె పాంచజన్య, పీజీ ఎల్ సెట్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లా కొదురుపాకకు చెందిన టి. ప్రవలిక మొదటి ర్యాంకులు సాధించారు.
డిగ్రీ ఫలితాలు వెల్లడైన తర్వాత న్యాయ విద్యతో పాటు వివిధ ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహిస్తామని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. లాసెట్ కన్వీనర్, వారి బృందం, ఓయూ అధికార వర్గం, టాటా కన్సల్టెంట్ వారికి పాపిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ పనిచేసి ఫలితాలను విడుదల చేశారన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు