1. కొత్తగా 617 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 617 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 3 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు 2,82,347 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. కాకాది కీలక పాత్ర
మాజీ మంత్రి వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాళులు అర్పించారు. రాష్ట్ర ఏర్పాటులో కాకా కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆయన వల్లే హైదరాబాద్‌లో సగానికి పైగా బస్తీలు ఉన్నాయని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. రూ.22,936 కోట్ల పంట రుణాల పంపిణీ
రాష్ట్రంలో వానా కాలం పంట రుణాల కింద సెప్టెంబరు 30 వరకూ రూ.22,936 కోట్లు అందించినట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) ప్రకటించింది. లక్ష్యంలో 71.82శాతం పూర్తయినట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. కలుషిత రొట్టెలు తిని ముగ్గురు మృతి
సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం పల్‌వట్లలో విషాదం చోటు చేసుకుంది. కలుషిత ఆహారం తిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా... మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. చలిని లెక్కచేయని రైతన్న
దిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు 27వ రోజుకు చేరాయి. తీవ్ర చలిలోనూ రైతులు నిరసనలు చేస్తున్నారు. సాగు చట్టాలు వెనక్కి తీసుకోవాలని రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. దేశంలో 20వేలకు దిగువన కేసులు
దేశంలో కొత్తగా 19,556 మందికి కరోనా సోకింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1,00,75,116కు చేరింది. గడిచిన 24 గంటల్లో 301మంది మృతిచెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. మోదీకి ట్రంప్ అవార్డు
భారత ప్రధాని నరేంద్ర మోదీకి 'లిజియన్ ఆఫ్ మెరిట్' అవార్డు అందించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మోదీ తరఫున ఈ అవార్డును తీసుకున్నారు అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. టీకాల ప్రభావం పెంచాలా?
బ్రిటన్ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకాతో రష్యా ఒప్పందం చేసుకుంది. స్పుత్నిక్ టీకాను ఆస్ట్రాజెనికా రూపొందించిన వ్యాక్సిన్‌తో కలిపి ప్రయోగించనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. ఓటీటీ.. నీకు ఇంత క్రేజ్ ఎందుకమ్మా?
నిత్యజీవితంలో ఓటీటీ కల్చర్ భాగమైపోయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సినిమాలు, వెబ్ సిరీస్‌లు అని తెగ చూసేస్తున్నారు. ఇంతకీ ఓటీటీ కథేంటంటే? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. 'నంబర్‌వన్'గా జకోవిచ్
సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ ప్రపంచ నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతూ.. డిసెంబరు 20తో 300 వారాలు పూర్తి చేసుకున్నాడు. ఫెదరర్ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా జకోవిచ్ నిలిచాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.