సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థుల ఆన్లైన్ తరగతుల కోసం తెలంగాణ జాగృతి సంస్థ 50 కంప్యూటర్లు, 500 కుర్చీలను బహుకరించింది. ఎస్సీ సంక్షేమ గురుకులాల్లో విద్యార్థుల బృందాలతో ఏర్పడిన విలేజ్ లెర్నింగ్ సర్కిల్స్‌కు వీటిని అందించినట్లు తెలంగాణ జాగృతి సంస్థ ఉపాధ్యక్షుడు మేడే రాజీవ్ సాగర్ వెల్లడించారు.
పేద విద్యార్థుల కోసమే...
కంప్యూటర్లు, ట్యాబ్‌లు కొనలేని పేద విద్యార్థులు ఆన్లైన్ చదువుకు దూరం కాకుండా ఉండాలని తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కవిత చెప్పినట్లు సాగర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను మంత్రి కొప్పుల ఈశ్వర్, గురుకుల సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభినందించారు.
ఇవీ చూడండి : తక్షణమే అధిష్ఠానం జోక్యం చేసుకోవాలి: రాములు యాదవ్