ETV Bharat / state

రాష్ట్రంలో ఐదు ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతి - హైదరాబాద్​ తాజా వార్తలు

రాష్ట్రంలో ఐదు ప్రైవేట్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. మహీంద్ర, వోక్సెన్, మల్లారెడ్డి, ఎస్ఆర్, అనురాగ్ యూనివర్సిటీలకు తుది అనుమతులు లభించాయి.

Five private universities allowed in Telangana
రాష్ట్రంలో ఐదు ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతి
author img

By

Published : May 20, 2020, 10:27 PM IST

రాష్ట్రంలో ఐదు ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్​ జారీ చేసింది. కుత్బుల్లాపూర్ మండలం బహదూర్ పల్లిలో మహీంద్ర, మెదక్ జిల్లా సదాశివపేటలో వోక్సెన్, మేడ్చల్ జిల్లా దూలపల్లిలో మల్లారెడ్డి, వరంగల్ జిల్లా హసన్​పర్తి మండలం అనంతసాగర్​లో ఎస్ఆర్, మేడ్చల్ జిల్లా ఘట్​కేసర్​లో అనురాగ్ యూనివర్సిటీలు ఏర్పాటుకు తుది అనుమతులు ఇచ్చింది. ప్రైవేట్ యూనివర్సిటీల చట్టంలో ఐదు యూనివర్సిటీలను పొందుపరుస్తూ ఆర్డినెన్సు జారీ చేసింది. అనుమతి లభించిన విశ్వవిద్యాలయాలు ఈ విద్యాసంవత్సరం నుంచే కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తున్నాయి.

మరో నాలుగు ప్రైవేట్ యూనివర్సిటీలకు లెటర్ ఆఫ్ ఇండెంట్ జారీ చేసినప్పటికీ.. తుది అనుమతులు రావల్సి ఉంది. ఇబ్రహీంపట్నంలో గురునానక్, ఘట్​కేసర్​లో శ్రీనిధి, శామీర్​పేటలో నిక్మార్, సంగారెడ్డిలో ఎంఎన్ఆర్ వైద్య విశ్వవిద్యాలయాలకు తుది అనుమతులు రావల్సి ఉంది. ప్రైవేట్ యూనివర్సిటీల్లో సామాజిక రిజర్వేషన్లు వర్తించవు. స్థానికులకు 25శాతం కోటా ఉంటుంది.

ఇవీ చూడండి: తొలిగిన అవరోధాలు.. ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.