కరోనా విస్తరణ ముప్పు అధికంగా ఉన్న మొదటి మూడు రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. మొదటి స్థానంలో మధ్యప్రదేశ్, రెండు, మూడు స్థానాల్లో బిహార్, తెలంగాణలు ఉన్నాయి. ఏయే జిల్లాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు విశ్లేషణలు జరిపినప్పుడు ఈ విషయం వెల్లడయింది.
అధ్యయనం వివరాలను ‘ద లాన్సెట్’ వైజ్ఞానిక పత్రికలో ప్రచురించారు. పరిశుభ్రత, ఆరోగ్య సౌకర్యాలు, ఇళ్లు తదితర 15 అంశాల ఆధారంగా వైరస్ ముప్పు ఉండే జిల్లాలను గుర్తించారు. ఈ మూడు రాష్ట్రాలతో పాటు ఝార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా, గుజరాత్ రాష్ట్రాల్లోనూ కరోనా తీవ్రత పెరిగే సూచనలు ఉన్నాయి. వీటి ఆధారంగా ఆయా రాష్ట్రాలు, జిల్లాలకు ముప్పు సూచికలు ఇచ్చారు. అధికార యంత్రాంగం తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి ఈ సూచికలు ఉపకరిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇదీ చూడండి:మహారాష్ట్రలో ఒక్కరోజే కరోనాతో 258 మంది మృతి