ETV Bharat / state

ఇంతకీ కార్యదర్శి ఉన్నట్టా? లేనట్టా? - నీటి పారుదల శాఖలో విచిత్ర పరిస్థితి - Irrigation Minister who did not attend the review

Telangana Irrigation Secretary issue : రాష్ట్ర నీటి పారుదల శాఖలో విచిత్ర పరిస్థితి నెలకొంది. శాఖకు కార్యదర్శి ఉన్నారా లేరా అన్న స్పష్టత కరవైంది. రజత్ కుమార్ పదవీ విరమణ తర్వాత స్మితా సభర్వాల్​కు అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి సమీక్షలకు ఆమె హాజరు కావడం లేదు. దస్త్రాలు కూడా చూడడం లేదని శాఖ వర్గాలు చెప్తున్నాయి.

Telangana Irrigation Department Officers
Telangana Irrigation Secretary issue
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 23, 2023, 9:28 AM IST

రాష్ట్ర నీటిపారుదల శాఖలో విచిత్ర పరిస్థితి - సమీక్షలకు హాజరుకాని ముఖ్యమంత్రి

Telangana Irrigation Secretary issue : నీటి పారుదల శాఖ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత కీలకం. ప్రాజెక్టులు, ఆనకట్టలు, కాల్వలు, సొరంగాలు, పంప్ హౌస్​లు, జలాశయాలు ఇలా భారీ నిర్మాణాలు చాలా పెద్ద సంఖ్యలో ఉంటాయి. నీటి పారుదల శాఖ వద్ద ఉండే ఆస్తుల సంఖ్య, వాటి విలువ కూడా భారీగానే ఉంటుంది. క్షేత్రస్థాయి విధి నిర్వహణ, పర్యవేక్షణతో పాటు పాలనా సంబంధితంగా ఎంతో మంది ఇంజినీర్లు, అధికారులు నీటి పారుదల శాఖలో ఉంటారు.

పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి రూ.58 వేల కోట్లు అవసరం - కాళేశ్వరానికి కావాల్సింది రూ.17,852 కోట్లు

Telangana Irrigation Department Officers : సాంకేతిక అంశాలతో పాటు పాలనా పరమైన అంశాల పర్యవేక్షణ కోసం ఈఎన్సీ వరకు వివిధ స్థాయిలో ఇంజినీర్లు ఉంటారు. వందలాది మంది ఇంజినీర్లు విధుల్లో ఉంటారు. ఈ వ్యవస్థ అంతా శాఖాధిపతి హెచ్ఓడీకి సంబంధించి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున పరిపాలనా అనుమతుల పర్యవేక్షణ, నిధుల విడుదల, ఉత్తర్వుల జారీకి సంబంధించి అన్ని శాఖల్లాగే నీటి పారుదల శాఖకు కూడా కార్యదర్శి ఉంటారు. శాఖకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా సీనియర్ ఐఏఎస్ అధికారికి బాధ్యతలు అప్పగిస్తారు. ఒక్కోమారు ఇద్దరిని కూడా నియమిస్తుంటారు. అయితే ప్రస్తుతం నీటి పారుదల శాఖలో విచిత్ర పరిస్థితి నెలకొంది. కీలకమైన ఈ శాఖకు కార్యదర్శి ఉన్నారా లేదా అన్న స్థితి నెలకొంది.

Irrigation Department : నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన సీనియర్ ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ గత నెల 30న పదవీ విరమణ చేశారు. దీంతో అప్పుడు ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్న స్మితా సభర్వాల్​కు నీటి పారుదల శాఖ బాధ్యతలు అదనంగా అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈలోగా రాష్ట్రంలో ఎన్నికల అనంతరం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. నీటి పారుదల శాఖను సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించారు.

సాగర్‌ వద్ద పూర్వ పరిస్థితిని పునరుద్ధరించాలంటూ కేఆర్‌ఎంబీకి తెలంగాణ లేఖ

ప్రమాణ స్వీకారం మరుసటి రోజే ఆయన జలసౌధలో సమీక్ష నిర్వహించారు. మేడిగడ్డ ఆనకట్ట కుంగిన నేపథ్యంలో పలు దఫాలుగా కూడా ఆయన ఇంజినీర్లతో సమావేశం అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి కూడా నీటి పారుదల శాఖపై సమీక్ష నిర్వహించారు. అయితే ఈ సమీక్షలకు స్మితా సభర్వాల్ హాజరు కాలేదు. కేవలం ఈఎన్సీలు, ఇంజినీర్లు మాత్రమే హాజరయ్యారు.

Irrigation Minister Not Attending Reviews : ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన సమయంలో మాత్రం స్మితా సభర్వాల్ హాజరయ్యారు. అయితే మంత్రితో దస్త్రంపై సంతకం మాత్రం (ENC) మురళీధర్ చేయించారు. అటు దస్త్రాలు కూడా చూడడం లేదని నీటి పారుదల శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటి వరకు అత్యవసరమైన కేవలం ఒకటి లేదా రెండు దస్త్రాలపై మాత్రమే సంతకాలు పెట్టినట్లు చెప్తున్నారు. పాతిక రోజులు కావస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కూడా నీటి పారుదల శాఖకు ఎవరినీ పూర్తి స్థాయి కార్యదర్శిగా నియమించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

సాగునీటి రంగానికి సంబంధించి ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందే : సీఎం రేవంత్​ రెడ్డి

బ్యారేజీ కుంగటానికి కారణమైన ఎవ్వరిని వదిలిపెట్టేది లేదు : ఉత్తమ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.