Ktr Tweet On Irrigation Projects National Status : రాష్ట్రానికి చెందిన సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరోమారు మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు. దేశాభివృద్ధికి తోడ్పడుతున్న రాష్ట్రాన్ని భారత ప్రభుత్వం గుర్తించాల్సి ఉందని ట్విటర్లో అన్నారు. నాడు కరవు నేలగా ఉన్న తెలంగాణ.. నేడు భారతదేశ ధాన్యాగారంగా మారిందని కేటీఆర్ పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరామని మంత్రి తెలిపారు.
-
A contributing state to Nation’s growth needs to be recognised by Govt of India
— KTR (@KTRBRS) May 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Once a parched area today Telangana state is turning into the granary of India
We have requested/demanded Govt of India in the past and once again reiterate that Telangana irrigation projects be… pic.twitter.com/LecLZ79cRg
">A contributing state to Nation’s growth needs to be recognised by Govt of India
— KTR (@KTRBRS) May 26, 2023
Once a parched area today Telangana state is turning into the granary of India
We have requested/demanded Govt of India in the past and once again reiterate that Telangana irrigation projects be… pic.twitter.com/LecLZ79cRgA contributing state to Nation’s growth needs to be recognised by Govt of India
— KTR (@KTRBRS) May 26, 2023
Once a parched area today Telangana state is turning into the granary of India
We have requested/demanded Govt of India in the past and once again reiterate that Telangana irrigation projects be… pic.twitter.com/LecLZ79cRg
Grant National Project Status To Telangana Irrigation : రాష్ట్రంలోని ఏదైన సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని మొదటి నుంచి కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. దేశంలో అత్యధికంగా జాతీయ ప్రాజెక్టు ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఉండగా.. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలోని పోలవరానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదాను ఇచ్చింది. కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక డిమాండ్లను చేస్తున్న వేళ.. కర్ణాటకలోని అప్పర్భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కేంద్రం ఇచ్చింది. ఈ ఏడాది లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ. 5,300 కోట్లు కేటాయించింది.
సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా దక్కాలంటే :
1. రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల నీటి నీటి అవసరాలను తీర్చే అంతర్ రాష్ట్ర ప్రాజెక్టులు. రెండు రాష్ట్రాల్లో ఉండడం వల్ల సమస్యలు అధికంగానే వస్తాయి.. ముఖ్యంగా రాష్ట్రాల మధ్య ఖర్చుల విభజన, పునరావాసం, విద్యుత్ ఉత్పత్తి అంశాలపై వివాదాలు వస్తాయి. అలాంటప్పుడు కేంద్రం జోక్యం చేసుకొని ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదాను ఇచ్చి సమస్యకు పరిష్కారం చూపుతోంది. పెరుగుతున్న నీటి అవసరాలు తీర్చడం, వృథాగా నీరు సముద్రంలోకి కలవకుండా నదుల అనుసంధానం కోసం చేపట్టే ప్రాజెక్టులకు కూడా జాతీయ హోదా ఇస్తారు.
2. అంతర్జాతీయ స్థాయిలో.. అంటే దేశానికి పొరుగున ఉన్న దేశాలతో కలిసి నిర్మించేలా ప్రాజెక్టు స్వరూపం ఉంటే అప్పుడు.. ముందుగా చేసుకొన్న ఒప్పందం ఆనీటిని దేశం వాడుకోనే వెసులుబాటు ఇవ్వాలి. ఆ ప్రాజెక్టును ఎక్కడ కడుతున్నారు.. ఎప్పటికి నిర్మాణం పూర్తవుతుంది అనే సమాచారం ఇవ్వాలి. ఆ ప్రాజెక్టు వల్ల ఉపయోగాలు ఉన్నాయని భావిస్తే కేంద్ర జలశక్తి శాఖ తగిన నిర్ణయం తీసుకోవచ్చు.
3. విస్తరణ, పునర్నిర్మాణం, ఆధునికీకరణ ప్రాజెక్టులు.. అంటే అప్పటికే ఉన్న ఓ ప్రాజెక్టును పొడిగించడం లేదా పునరుద్ధరణ పనులు చేస్తే కనీసం 2 లక్షల హెక్టార్లకు నీరు అందించే స్థాయికి చేరడం వంటివి. ఇలా ఉంటే కచ్చితంగా జాతీయ హోదా ఇవ్వవచ్చు.
4. సాగునీటి ప్రాజెక్టు ఒక రాష్ట్రంలోనే ఉండి.. ఆ రాష్ట్ర అవసరాలు తీర్చే ప్రాజెక్టులు.. రాష్ట్రంలోని ప్రజల సాగునీటి అవసరాలు తీర్చగలరు. ముఖ్యంగా రెండు లక్షల హెక్టార్లు.. దాటి పొలాలకు సాగు నీరు అందించాలి. నీటి పంపకాల విషయంలో ఎలాంటి తగాదాలు ఉండకూడదు. హైడ్రాలజీ సిస్టం అంటే ప్రాజెక్టులోని నీరు తిరిగి ప్రాజెక్టులో చేరే అనుకూలతలు ఉండాలి.
ఇవీ చదవండి :