Telangana Inter results 2023 release today : రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్ ఇంటర్మీడియట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఈరోజు ఉదయం 11 గంటలకు ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన ఇంటర్ పరీక్షలకు సుమారు 9.5 లక్షల మంది హాజరయ్యారు. ప్రథమ సంవత్సరం 4, 82,677 మంది.. ద్వితీయ సంవత్సరం 4, 65,022 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
మరోసారి ఫలితాలను క్షుణ్ణంగా పరిశీలన : మూల్యాంకన ప్రక్రియ సుమారు ఇరవై రోజుల క్రితమే పూర్తయింది. మార్కుల అప్‌లోడ్ వంటి ప్రక్రియ పూర్తి చేసి.. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మరోసారి ఫలితాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్, ఇతర ఉన్నతాధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ క్రమమలోనే ఇవాళ ఫలితాలు వెల్లడించాలని నిర్ణయించారు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లలో చెక్ చేసుకోవచ్చని తెలిపారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ తేదీలతో పాటు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను కూడా ఇవాళ ప్రకటించనున్నారు.
పక్కాగా ఒక్క నిమిషం నిబంధన అమలు: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించారు. రెండో ఏడాది చదువుతున్న ఇంటర్ విద్యార్థులకు మార్చి 29న ముగిశాయి. పరీక్షలు జరిగిన అన్ని రోజులు ఉదయం 9 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అధికారులు అనుమతించలేదు. దీంతో పక్కాగా ఒక్క నిమిషం నిబంధనను అమలు చేశారు. బోర్డు నిబంధనల ప్రకారం ఉదయం 8.45 గంటల నుంచి 9 గంటల మధ్యలోనే ఓఎంఆర్ షీట్‌ను విద్యార్థులు నింపాలని తెలిపారు. ఓఎంఆర్ పత్రం ఇవ్వగానే అందులో పేరు, హాల్ టికెట్ నంబర్ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోవాలని అధికారులు సూచించిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి:
- EAMCET Exam Preparation Tips : ఇలా ప్రిపేర్ అయితే.. ఎంసెట్‌లో మంచి ర్యాంకు పక్కా
- KTR Mancherial District Tour : 'ఇంటింటికీ తాగునీరు ఇచ్చేందుకు మిషన్ భగీరథ పనులు చేపట్టాం'
- 'ఇంకెంత కాలం బతుకుతానో తెలియదు.. నన్ను చంపాలనుకున్నా పేదల కోసం పోరాటంలో తగ్గేదేలే!'
- 49 ఏళ్ల ఏజ్‌లో హోంగార్డ్ ఉద్యోగం.. అపాయింట్మెంట్ లెటర్ కోసం 14 సంవత్సరాలు వేచి చూస్తే..