ఇంటర్ విద్యార్థుల అసైన్మెంట్ స్వీకరణ, ఫీజుల చెల్లింపునకు ముడి పెట్టొద్దని రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు కళాశాలలకు అదేశాలు జారీ చేసింది. ఫీజు కట్టనందుకు అసైన్మెంట్ స్వీకరించలేదని, ఫీజులు చెల్లించాలని బలవంతం చేస్తున్నట్లు తెలిస్తే తీవ్రమైన చర్యగా పరిగణిస్తామని పేర్కొంది.
అలాంటి కళాశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మే 5 లోపు అసైన్మెంట్ వాల్యుయేషన్ చేసి మార్కులివ్వాలని ఆదేశించింది.
ఇదీ చదవండి: 1నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులు ప్రమోట్