ETV Bharat / state

'ప్రశ్నాపత్రంలో అక్షరదోషాలు... గందరగోళంలో విద్యార్థులు' - Telangana Intermediate Board

పరీక్షల నిర్వహణలో ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యం మరోసారి బయట పడింది. నేటి ద్వితీయ సంవత్సరం ఆంగ్ల పరీక్ష ప్రశ్నాపత్రంలో అక్షర దోషాలు దొర్లాయి. ప్రశ్నలు అర్థం కాక విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. దీనికి ఇంటర్ బోర్డు బాధ్యత వహించి... మార్కులు కలపాలని విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులు డిమాండ్ చేస్తున్నారు.

Inter
Inter
author img

By

Published : Mar 7, 2020, 8:36 PM IST

తెలంగాణలో ఇంటర్​ పరీక్షల నిర్వహణలో బోర్డు తీరు వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ జరిగిన ఇంటర్​ ద్వితీయ సంవత్సర ఆంగ్లపరీక్షలో నాలుగు ప్రశ్నల్లో అక్షర దోషాలు చోటు చేసుకున్నాయి. ప్రశ్నలు అర్థం కాక విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. కొందరు విద్యార్థులు ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకెళ్లగా... వారు ఇంటర్​బోర్డు ఉన్నతాధికారులకు వివరించారు. తేరుకున్న అధికారులు... తప్పుల్ని సరిచేసి చెప్పాలని ఇన్విజిలేటర్లకు చివరి అరగంటలో సమాచారమిచ్చారు.

అప్పటికే విద్యార్థులు... ప్రశ్న అర్థం కాక పదేపదే చదివి తీవ్ర ఒత్తిడికి లోనయ్యారని తల్లిదండ్రులు, అధ్యాపకులు చెబుతున్నారు. దీనికి బోర్డు బాధ్యత వహించి.. మార్కులు కలపాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు నేటి పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా 57 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలోనే 32 మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకోగా.. రంగారెడ్డి జిల్లాలో 10 నమోదయ్యాయి. వనపర్తి జిల్లాలో 7, నిజమాబాద్ జిల్లాలో 4, జనగాం, నాగర్ కర్నూలు, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మాల్ ప్రాక్టీస్ ఘటనలు నమోదైనట్లు ఇంటర్ బోర్డు తెలిపింది.

'ప్రశ్నాపత్రంలో అక్షరదోషాలు... గందరగోళంలో విద్యార్థులు'

ఇదీ చూడండి : 'వైస్ ప్రిన్సిపల్​పై చర్యలు తీసుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.