ETV Bharat / state

Students Suicides In Telangana : పరీక్షల్లో తప్పామని ప్రాణాలు తీసుకున్న 8 మంది విద్యార్థులు

author img

By

Published : May 10, 2023, 2:28 PM IST

Students Suicides In Telangana : తెలంగాణలో నిన్న విడుదలైన ఇంటర్​ ఫలితాల్లో తమకు తక్కువ మార్కులు వచ్చాయని కొందరు, ఫెయిలయ్యామని మరికొంతమంది విద్యార్థులు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకొంత విద్యార్థులు ఇల్లు వదిలి వెళ్లారు.

Suicides
Suicides

Students Suicides In Telangana : రాష్ట్రంలో నిన్న విడుదలైన ఇంటర్​ ఫలితాల్లో తాము ఫెయిలయ్యామని కొందరు, మార్కులు తక్కువగా వచ్చాయని మరికొందరు వివిధ జిల్లాల్లో మొత్తం 8 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..

*జగిత్యాల జిల్లాలోని ఓ ప్రైవేటు కాలేజీలో మేడిపల్లికి చెందిన విద్యార్థి (16) ఇంటర్మీడియట్​ ఫస్ట్​ ఇయర్​ చదివాడు. పరీక్షల్లో 4 సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడని మనస్తాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకున్నాడు.
*హైదరాబాద్‌లో ఓ కార్పొరేట్‌ విద్యాసంస్థలో నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌కు చెందిన విద్యార్థి(17) ఇంటర్‌ ప్రథమ సంవత్సరం(బైపీసీ) చదివాడు. మూడు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడని ఇంట్లో ఉరి వేసుకున్నాడు.
*ఈసీఐఎల్‌ రామకృష్ణాపురంలో ఉంటూ, పటాన్‌చెరులో ఓ కాలేజీలో తిరుపతికి చెందిన విద్యార్థి (17) ఇంటర్‌(ఎంపీసీ) చదివాడు. రాసిన మొదటి సంవత్సరం పరీక్షల్లో ఫెయిల్​ అవుతానని మనస్తాపంతో సోమవారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. మంగళవారం ఉదయం మేడ్చల్‌ రైల్వేస్టేషన్లో పట్టాలపై అతడి మృతదేహం లభ్యమైంది. అతని ఫలితాలు తెలియలేదు.
*గద్వాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థి వయస్సు (17) హైదరాబాద్​ ఓ ప్రైవేట్​ కాలేజీలో చదువుతున్నాడు. ప్రథమ సంవత్సరం పరీక్షల్లో ఒక సబ్జెక్టులో ఫెయిల్​ అవ్వడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
*ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థిని(17) హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌(ఎంపీసీ) చదివుతుంది. విడుదవ అయిన ఫలితాల్లో ఫెయిల్‌ కావడంతో మానసిక ఒత్తిడికి గురై ఇంట్లో ఉరేసుకుంది.
*సికింద్రాబాద్‌లోని నేరేడ్‌మెట్‌ పోలీస్​స్టేషన్​ పరిధిలోని వినాయక్‌ నగర్‌కు చెందిన విద్యార్థి(17) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదివాడు. ఒక సబ్జెక్టులో ఫెయిల్‌ అవడంతో ఇంట్లో ఫ్యాన్​కు ఉరేసుకున్నాడు.
*ఖైరతాబాద్‌ తుమ్మలబస్తీకి చెందిన విద్యార్థి(17) ఎస్సార్‌నగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్​ రెండో సంవత్సరం పూర్తిచేశాడు. ఒక సబ్జెక్టులో తప్పడంతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

విద్యార్థిని అదృశ్యం:
ఇంటర్‌లో పరీక్షల్లో విఫలమైందని మనస్తాపంతో ఓ విద్యార్థిని అదృశ్యం అయిన ఘటన బీడీఎల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై సాయిలు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్‌చెరువప సమీపంలోని పాటి గ్రామంలో నివాసం ఉంటున్న భవాని.. ఇంటర్‌ రెండో సంవత్సరంలో కొన్ని సబ్జెక్టుల్లో పాస్‌ అవ్వలేదు. బయటకు వెళ్లి వస్తానని ఇంట్లో ఉన్న అక్కకు చెప్పి వెళ్లిన భవాని తిరిగి ఇంటికి రాలేదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.