ETV Bharat / state

అధ్యాపకులు కాలేజీలకు రావాల్సిందే.. - జూనియర్​ కాలేజీలకు టీచర్లు రావాలి

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్​ విద్యార్థులకు ఆన్​లైన్​ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్​ కళాశాలల్లో పనిచేసే టీచర్లతోపాటు బోధనేతర సిబ్బంది విధులకు హాజరు కావాలని ఇంటర్​ విద్యాశాఖ తెలిపింది. పరీక్షల ఏర్పాటు, పర్యవేక్షణ, జూమ్​, వాట్సప్​ ద్వారా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయాలని వెల్లడించింది.

telangana inter board said Faculty should come to colleges
అధ్యాపకులు కళాశాలలకు రావాల్సిందే
author img

By

Published : Mar 25, 2021, 6:41 AM IST

ఆన్‌లైన్‌ తరగతుల పర్యవేక్షణ, జూమ్‌, వాట్సప్‌ ద్వారా విద్యార్థుల సందేహాల నివృత్తికి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులతోపాటు.. బోధనేతర సిబ్బంది విధులకు హాజరు కావాల్సిందేనని ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌ జలీల్‌ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్‌ వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అయితే, ఏప్రిల్‌ 1, 3వ తేదీల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు.. ‘మానవీయ విలువలు, పర్యావరణ విద్య’ పరీక్షలను నిర్వహిస్తారా? లేదా? అన్న అంశాన్ని.. స్పష్టం చేయాలని కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్‌ కోరారు.

స్పష్టత ఇవ్వని పాఠశాల విద్యాశాఖ

ఉపాధ్యాయుల హాజరు విషయంలో పాఠశాల విద్యాశాఖ అధికారులు బుధవారం కూడా స్పష్టత ఇవ్వలేదు. దీనిపై ఉపాధ్యాయులు, సంఘాల నేతలు అధికారులకు సంక్షిప్త సందేశాలు పంపించగా.. ఇంకా నిర్ణయం తీసుకోలేదని వారు సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం 100 శాతం ఉపాధ్యాయులు విధులకు హాజరవుతున్నారు.

ఇదీ చూడండి : ప్రతి నీటి చుక్కా సద్వినియోగం కావాలి: సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.