High Court Hearings: కరోనా వ్యాప్తి నేపథ్యంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టులోని అన్ని బెంచిల్లో కేసుల ప్రత్యక్ష విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కేసుల విచారణ ప్రత్యక్షంగా లేదా ఆన్‌లైన్‌లో చేపట్టాలనే విచక్షణాధికారం న్యాయమూర్తులకు ఉంటుందని హైకోర్టు తెలిపింది.
ప్రత్యక్ష విచారణ చేపడితే కొవిడ్ నిబంధనలు పాటించాలని ఉత్తర్వుల్లో ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. తక్షణమే అమల్లోకి వస్తాయని... తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అమల్లో ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది.
నుమాయిష్‌పై...
High court on Numaish exhibition : 2019 నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో అగ్నిప్రమాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. నాటి ఘటనను దృష్టిలో ఉంచుకొని.. ఎగ్జిబిషన్ నిర్వహణకు ఫైర్, జీహెచ్ఎంసీ అనుమతి తీసుకోవాలని జీవో ఇచ్చామని ప్రభుత్వం తరఫు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ వివరణతో సంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం.. 2019 అగ్నిప్రమాదంపై విచారణ ముగిస్తున్నట్లు వెల్లడించింది. వివిధ విభాగాల అనుమతి తీసుకోవాలన్న ఉత్తర్వులు అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇదీచూడండి: