ETV Bharat / state

'మృతదేహాలకు మళ్లీ శవపరీక్ష నిర్వహించాలి'

కొత్తగూడెం జిల్లా చర్ల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. మృతదేహాలకు మళ్లీ శవపరీక్ష చేయాలని ఈ మేరకు హైకోర్టు తెలిపింది. కుటుంబ సభ్యుల నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకుని కొత్తగూడెం మార్చురీలో భద్రపరచాలని ఎస్పీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

telangana high court said charla encounter Bodies to be autopsied again
'మృతదేహాలకు మళ్లీ శవపరీక్ష నిర్వహించాలి'
author img

By

Published : Sep 24, 2020, 5:14 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని చెన్నాపురం వద్ద జరిగిన ఎన్​కౌంటర్ మృతులకు మళ్లీ శవపరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. కుటుంబ సభ్యుల నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకుని కొత్తగూడెం మార్చురీలో భద్రపరచాలని ఎస్పీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి చెందిన ఫోరెన్సిక్ నిపుణులతో శవపరీక్ష జరిపాలని.. దాన్ని వీడియో చిత్రీకరించాలని పేర్కొంది.

ఎన్​కౌంటర్ పేరిట ముగ్గురిని పోలీసులు కాల్చి చంపారని ఆరోపిస్తూ పౌర హక్కుల సంఘం హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేసింది. అత్యవసర వ్యాజ్యంగా పరిగణించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పోలీసులపై ఐపీసీ 302 సెక్షన్ కింద హత్య కేసు నమోదు చేయాలని సీఎల్​సీ తరపు న్యాయవాది రఘునాథ్ వాదించారు.

మృతదేహాలకు ఫోరెన్సిక్ నిపుణులతో శవపరీక్ష జరిపించాలని కోరారు. అయితే ఇప్పటికే శవపరీక్ష జరిపి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అడ్వకేట్ జనరల్ తెలిపారు. ఎంజీఎం ఆస్పత్రి ఫోరెన్సిక్ నిపుణులతో మరోసారి శవపరీక్ష జరిపి.. సీల్డ్ కవర్​లో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబరు 5కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి : మేయర్లు, నగరపాలికల పరిధి ఎమ్మెల్యేలతో సీఎం సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.