hc on mp Arvind : సీఎం కేసీఆర్‌ను కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు చేశారన్న కేసులో ఎంపీ అర్వింద్‌పై కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. అయితే సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టొద్దని అర్వింద్‌కు ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మద్యం దుకాణాల వేళలు పొడిగించిన సందర్భంలో కేసీఆర్‌ను కించపరిచేలా కార్డూన్ పోస్టు చేశారని అర్వింద్‌పై అభియోగం. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ అర్వింద్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారణ చేపట్టారు. కేరికేచర్ రూపొందించే హక్కు ఉంటుంది కానీ.. రాజ్యాంగపరమైన ఉన్నత స్థానాల్లో ఉన్న వారిని గౌరవించాల్సిన అవసరం కూడా ఉందని ఎంపీ అర్వింద్‌ను ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యానించింది. బంజారాహిల్స్ కేసులో పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించిన హైకోర్టు.. విచారణను ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: ఎంపీ అర్వింద్‌పై ఏసీపీకి తెరాస నాయకుల ఫిర్యాదు.. ఎందుకంటే?
MLA Jagga Reddy comments on DGP: 'కొవిడ్ నిబంధనలు కాంగ్రెస్‌కేనా.. భాజపాకు వర్తించవా?'