High Court orders Stop Adjustment VRAs : వీఆర్‌ఏల సర్దుబాటును హైకోర్టు నిలిపివేసింది. వీఆర్‌ఏ(VRA)లను ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు(Telangana High Court) సస్పెండ్ చేసింది. జులై 24న జీవోకు ముందు ఉన్న స్థితిని యథాతథంగా కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వీఆర్‌ఏలకు పేస్కేల్(VRA Pay Scale) అమలు చేస్తూ ఇతర శాఖల్లోకి బదిలీ చేస్తూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా రెవెన్యూ శాఖ జులై 24న జీవో 81, ఆర్థిక శాఖ ఆగస్టు 3న జీవో 85 జారీ చేశాయి. ఇతర శాఖల్లోకి నియమిస్తూ ఈనెల 3న సీసీఎల్‌ఏ మార్గదర్శకాలు జారీ చేశారు.
వాటి ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 61ఏళ్లలోపు వయసున్న 16వేల 758 మంది వీఆర్‌ఏలను వారి విద్యార్హతలకు అనుగుణంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో లోయర్ గ్రేడ్ సర్వీస్, రికార్డు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగ విరమణ వయసు దాటిన మరో 3,797 మంది కుమారులు లేదా కుమార్తెలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని నిర్ణయించారు. అయితే చట్టాలు, సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా సర్దుబాటు ప్రక్రియ జరిగిందని.. తమకు రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని పలువురు వీఆర్‌ఏలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది.
CM KCR Review : వీఆర్ఏ వ్యవస్థ శాశ్వతంగా రద్దు.. అర్హత ప్రకారం వారికి వివిధ శాఖల్లో సర్దుబాటు
Telangana High Court Stayed Adjustment VRAs : పిటిషనర్ల వాదనతో ప్రాథమికంగా ఏకీభవించిన హైకోర్టు.. జీవోలను సస్పెండ్ చేస్తూ.. జులై 24కి ముందు స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ను, ఎన్నికల కమిషన్‌ను ప్రతివాదుల జాబితాను తొలగించాలని పిటిషనర్లను హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
VRAs Arrangements : రెవెన్యూశాఖలోనే కొనసాగించాలి.. మంత్రివర్గ ఉపసంఘాన్ని కోరిన వీఆర్‌ఏ ఐకాస
KCR on VRAS : ప్రభుత్వ ఉద్యోగులుగా వీఆర్ఏలు.. ఉత్తర్వులు జారీ