రాష్ట్రంలో వలస కార్మికుల పరిస్థితులపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిగింది. లాక్డౌన్ సమయంలో వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు. కామారెడ్డిలో ఓ కార్మికుడు మరణించాడని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 3 లక్షల మంది వలస కార్మికులను గుర్తించినట్లు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. వారిలో 2 లక్షల మంది షెల్టర్లలో ఉన్నారని... వారికి బియ్యం, 1500 రూపాయలు ఇస్తున్నట్లు వివరించారు.
మిగతా లక్ష మంది పరిస్థితి ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. లాక్డౌన్ సందర్భంగా వలస కార్మికులను ప్రభుత్వం ఎలా ఆదుకుంటుందో పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. కొంత సమయం కావాలని ఏజీ కోరగా... అంగీకరించిన హైకోర్టు విచారణను మే 6కి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: 50 మంది మీడియా, వైద్య సిబ్బందికి కరోనా