ETV Bharat / state

ధరణి పోర్టల్​ను కొనసాగిస్తారా? లేదా? - స్పష్టత ఇవ్వండి : హైకోర్టు

Telangana High Court on Dharani Portal : రాష్ట్రంలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్​ను కొనసాగిస్తారా? లేదా? అని కాంగ్రెస్​ సర్కార్​ను హైకోర్టు ప్రశ్నించింది. ఈ అంశంలో స్పష్టతనిస్తే తమ ముందున్న పిటిషన్లు పరిష్కరిస్తామని పేర్కొంది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని చెప్పిందుకు 4 వారాలు గడువు ఇవ్వాలని ఏజీ సుదర్శన్​ రెడ్డి కోరగా, ఫిబ్రవరి 2వ తేదీకి విచారణను వాయిదా వేసింది.

Dharani Portal Problems in Telangana
Telangana High Court on Dharani Portal
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 6, 2024, 10:50 AM IST

Telangana High Court on Dharani Portal : గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన 'ధరణి'ని కొనసాగిస్తున్నారా, లేదా, అన్నదానిపై స్పష్టతనివ్వాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని హైకోర్టు శుక్రవారం ప్రశ్నించింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం(Congress Government) ధరణిని కొనసాగిస్తున్నారో లేదో చెబితే దాన్ని పరిగణనలోకి తీసుకుని తమ ముందున్న పిటిషన్లను పరిష్కరిస్తామని తెలిపింది. ప్రభుత్వ విధాన నిర్ణయం ఏమిటో చెప్పాలంటూ నూతన అడ్వొకేట్ జనరల్ సుదర్శన్​ రెడ్డిని వివరణ ఇవ్వాలని అడిగింది. దీనిపై ప్రభుత్వ నిర్ణయం చెప్పడానికి 4 వారాల గడువు కావాలని ఏజీ చెప్పడంతో విచారణను షిబ్రవరి 2వ తేదీకి వాయిదా వేసింది.

'ధరణి పేరుతో తెలంగాణలో భారీ భూకుంభకోణం జరిగింది'

Congress Government on Dharani Portal : రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టిగాగులపల్లిలో వివిధ సర్వే నెంబర్లలోని 146.05 ఎకరాలకు చెందిన వివిధ విక్రయ దస్తావేజుల సర్టిఫైడ్ కాపీలను గండిపేట ఎమ్​ఆర్​ఓ ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్​కు చెందిన ఎం జైహింద్ రెడ్డితో పాటు మరికొందరు ధరణిలో ఎదువుతున్న సమస్యలపై పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ లక్ష్మణ్ గత ఏడాది ఏప్రిల్లో విచారణ చేపట్టడంతో పాటు భూపరిపాలన ప్రధాన కమిషనర్​ను కోర్టుకు పిలిపించి పలు సందేహాలపై వివరణ కోరారు.

ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై దర్యాప్తు! - ధరణి పోర్టల్​లోని వివరాల సేకరణపై సర్కార్ ప్రత్యేక నజర్

High Court Investigation Dharani Mistakes in Telangana : కోర్టుకు వస్తున్న పిటిషన్ల ఆధారంగా ధరణిలో 20 వరకు సమస్యలు ప్రధానంగా ఉన్నాయని గుర్తించారు. ఇందులో ప్రధానంగా నిర్దిష్ట గడువులోగా ఈ పట్టాదారు పాస్​బుక్​​లో సవరణకు ఆన్​లైన్​లో దరఖాస్తులు స్వీకరించకపోవడం, సర్వే నిమిత్తం ఎఫ్-లైన్ దరఖాస్తులను స్వీకరించకపోవడం, బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు నిర్వహించిన వేలంలో కొనుగోలు చేసిన ఆస్తులకు విక్రయ దస్తావా జులను జారీ చేయకపోవడం, ధరణి పోర్టల్లో ఉన్న జీపీఏలను రిజిస్ట్రేషన్ సమయంలో పట్టించుకోకపోవడం లేదన్న సమస్యలున్నాయని గుర్తించారు. దీంతో పాటు ఎలాంటి కారణాలు పేర్కొనకుండా ఎఫ్-లైన్ దరఖాస్తులను 'రెజెక్టడ్' అని తిరస్కరించడం, సరైన పద్ధతిలో సమర్పించలేదంటూ దరఖాస్తులను తిరస్కరించడం, కోర్టు డిక్రీల్లో టైటిల్ మార్పుపై స్పష్టత లేకపోవడం, ఇందుకు పరిమితులు లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయన్నారు.

ధరణి పోర్టల్‌పై సమగ్ర నివేదిక కోసం రెవెన్యూ శాఖ కసరత్తు

Dharani Portal Problems in Telangana : సమస్యల పరిష్కారంలో మాడ్యూల్స్​ ఏర్పాటు చేసినట్లుగా ఎలాంటి నివేదిక అందలేదని దీంతో కొత్త ప్రభుత్వం ధరణి పోర్టల్​ను కొనసాగిస్తుందో లేదో చెప్పాలంటూ ఆడ్వొకేట్ జనరల్ న్యాయమూర్తి ప్రశ్నించారు. ఒక ధరణిని కొనసాగించబోవడంలేదంటే ఇందులో ఉత్తర్వులు అవసరంలేదని, లేదంటే గత ఉత్తర్వుల అమలు గురించి పరిశీలిస్తామన్నారు. దీనిపై ఏజీ సుదర్శన్​ రెడ్డి స్పందిస్తూ కొన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని, అయితే ధరణి(Dharani in Telangana) కొనసాగింపునకు సంబందించి నిర్ణయం చెప్పడానికి 4 వారాల గడువు కావాలని కోరడంతో న్యాయమూర్తి విచారణను ఫిబ్రవరి 2 వరకు వాయిదా వేశారు.

ధరణి పోర్టల్‌ ప్రక్షాళన మొదలైంది - వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు : పొంగులేటి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.