High Court on MBBS Exams: పరీక్షల నిర్వహణ వంటి విద్యా సంబంధిత విషయాల్లో చట్టవిరుద్ధమైతే తప్ప జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. విచక్షణాధికారాలను ఉపయోగించి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం పరీక్షలను తిరిగి నిర్వహించాలని ఆదేశించలేమని పేర్కొంది. డిజిటల్ పద్ధతిలో పరీక్షలు జరపడం వల్ల నష్టపోయామని.. 5 గ్రేస్ మార్కులు కలిపేలా ఆదేశించాలన్న అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. వార్షిక పరీక్షలు జాతీయ వైద్య కమిషన్, యూనివర్సిటీ నిబంధనలకు విరుద్ధంగా జరిగాయంటూ దాఖలైన పలు పిటిషన్లను కొట్టివేస్తూ జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి తీర్పు వెలువరించారు.
HC judgment on MBBS exams: డిజిటల్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించడం వల్ల నష్టపోయామని విద్యార్థులు నిరూపించలేక పోయారన్నారు. మూల్యాంకనంలో అనుమానాలు ఉంటే... రీవాల్యుయేషన్కు అవకాశం ఉన్నప్పటికీ.. ఆ ప్రయత్నం చేయలేదని పేర్కొంది. పరీక్ష విధానం మార్చిన వెంటనే అభ్యంతరం వ్యక్తం చేయకుండా పరీక్షలు, సప్లిమెంటరీ కూడా పూర్తయ్యాక కోర్టును ఆశ్రయించడాన్ని తప్పుపట్టింది. నిపుణులతో చర్చించిన తర్వాతే యూనివర్సిటీ ఈ విధానాన్ని ప్రవేశపెట్టిందని.. పరీక్షల్లో 90శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని ప్రస్తావించింది. గ్రేస్ మార్కులు యూనివర్సిటీ విచక్షణాధికారమని.. తాము జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.
ఇదీ చదవండి: DGP Mahender reddy speech: 'సాంకేతికత పురోగతితో సంప్రదాయ నేరాల దర్యాప్తు వేగవంతం'