హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.శ్రీసుధ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి మూలమూర్తిని దర్శించుకుని.. మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించగా.. తితిదే అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.
12న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం (ఈ నెల 17న) పురస్కరించుకుని ఈ నెల 12న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 12న వీఐపీ బ్రేక్ దర్శనాలను తితిదే రద్దు చేసింది. ఈ కారణంగా ఈ నెల 11న వీఐపీ బ్రేక్ దర్శనాలకు ఎలాంటి సిఫార్సు లేఖలనూ స్వీకరించరు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని తితిదే విజ్ఞప్తి చేసింది.
ఇవీ చదవండి: రాష్ట్రంలో కుండపోత.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. నేడూ, రేపూ అతి భారీ వర్షాలు
కన్నకూతురుపై తండ్రి అత్యాచారం.. చంపేస్తానని బెదిరించి ఏడాదిన్నరగా..