తెలంగాణ హైకోర్టు న్యాయమూర్జి జస్టిస్ చల్లా కోదండరామ్ పదవీ విరమణ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు అడ్వొకేట్స్ అసోషియేషన్ ఘనంగా వీడ్కోలు పలికింది. న్యాయమూర్తిగా జస్టిస్ చల్లా కోదండరామ్ చేసిన సేవలను ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ కొనియాడారు. పేదలకు న్యాయం చేకూర్చే దిశగా జస్టిస్ కోదండరామ్ తీర్పులు ఉన్నాయని.. నిబద్ధతతో పనిచేసిన ఆయన సేవలు ఇతరులకు స్ఫూర్తిదాయకమన్నారు.
హైకోర్టు న్యాయవాదులు అసోషియేషన్ జస్టిస్ చల్లా కోదండరాంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బార్ అండ్ బెంచ్ మధ్య సమన్వయంతోనే న్యాయం జరుగుతుందని.. లాయర్ల సహకారంతోనే తన విధుల నిర్వహణ సులభతరమైందని జస్టిస్ చల్లా కోదండరామ్ అన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ చల్లా కోదండరామ్ దంపతులను అడ్వొకేట్స్ అసోషియేషన్ ఘనంగా సన్మానించింది. పలువురు న్యాయవాదులు ఈ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్నారు.
ఇదీ చూడండి: Ramappa: నిర్లక్ష్యం వహిస్తే దేశమంతా నిందిస్తుంది: హైకోర్టు