ETV Bharat / state

జీహెచ్​ఎంసీ రిజర్వేషన్లపై వివరణ ఇవ్వాలి: హైకోర్టు - తెలంగాణ వార్తలు

జీహెచ్​ఎంసీ రిజర్వేషన్లకు సంబంధించిన చట్ట సవరణను సవాల్ చేస్తూ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు రాజ్యంగ విరుద్ధంగా లేవన్న వ్యాజ్యంపై వివరణ ఇవ్వాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబరు 15కి వాయిదా వేసింది.

telangana-high-court-inquired-on-ghmc-reservations-petition
జీహెచ్​ఎంసీ రిజర్వేషన్లపై వివరణ ఇవ్వాలి: హైకోర్టు
author img

By

Published : Mar 1, 2021, 6:04 PM IST

జీహెచ్ఎంసీ వార్డుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు రాజ్యంగ విరుద్ధంగా లేవన్న వ్యాజ్యంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం, జీహెచ్​ఎంసీ, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. రిజర్వేషన్లకు సంబంధించిన చట్ట సవరణను సవాల్ చేస్తూ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ దాఖలు చేసిన పిటిషన్​పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను కేటాయించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు. ఎస్సీలకు 15, ఎస్టీలకు 6 ఉండాలన్న నిబంధనను పాటించలేదన్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలైపోయిన తర్వాత పిటిషన్​పై విచారణ జరిపి ఏం ప్రయోజనమని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికలకు ముందే పిటిషన్ దాఖలు చేశామన్న చిక్కుడు ప్రభాకర్.. రెండు పర్యాయాలు ఇవే రిజర్వేషన్లు ఉంటాయని చట్టంలో పేర్కొన్నందున కనీసం వచ్చే ఎన్నికలకైనా ఉపయోగపడుతుందని వాదించారు. దీనిపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబరు 15కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: గిఫ్ట్ కార్డుల పేరుతో మోసం.. ఝార్కండ్ ముఠా అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.