ETV Bharat / state

High Court on MLAs Purchase Case: 'పార్టీ మనుషుల్లా కాకుండా లాయర్​లా వాదించండి' - Telangana High Court hearing on MLAs Purchase Case

High Court on MLAs Purchase Case: 'ఎమ్మెల్యేల ఎర కేసు'లో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పార్టీ వ్యక్తుల్లా కాకుండా వృత్తిపరంగా వాదించాలని లాయర్లకు సూచించింది. తదుపరి విచారణను హైకోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది.

MLAs purchase Case updates
ఎమ్మెల్యేల ఎర కేసు
author img

By

Published : Nov 23, 2022, 12:13 PM IST

MLAs Purchase Case Updates: ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులకు ఇచ్చిన 41 ఏ నోటీసులపై హైకోర్టులో విచారణ జరిగింది. బి.ఎల్.సంతోష్ విచారణకు హాజరు కాలేదని ఏజీ ప్రసాద్ కోర్టుకు వివరించారు. ఇతర పనుల్లో ఉండడం వల్లే హాజరు కాలేదని బి.ఎల్‌.సంతోష్‌ తరఫు న్యాయవాది రామచందర్ రావు కోర్టుకు తెలిపారు. ఇతర పనులున్నాయని చెప్పడం సరైన సమాధానం కాదని ఏజీ అన్నారు. సాక్ష్యాల తారుమారుకే ఆలస్యం చేస్తున్నారని ఏఏజీ రామచంద్రరావు ఆరోపించారు.

High Court on MLAs Purchase Case : సంతోష్ అనారోగ్యసమస్యలతో బాధపడుతున్నారని బీజేపీ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. కొంత సమయం కావాలని సంతోష్‌ సిట్‌కు లేఖ రాశారని తెలిపారు. 41ఏ నోటీసులను సవాల్‌ చేయాలనుకుంటే సంతోష్ నేరుగా హైకోర్టును ఆశ్రయించొచ్చని జడ్జి సూచించారు. సంతోష్‌తో మాట్లాడి కోర్టుకు చెబుతామన్న బీజేపీ తరఫు న్యాయవాది రామచందర్‌రావు తెలిపారు. ఏఏజీ, రామచందర్ రావు వాదిస్తుండగా హైకోర్టు జడ్జి జోక్యం చేసుకున్నారు. టీఆర్ఎస్, బీజేపీ న్యాయవాదుల్లా కాకుండా వృత్తిపరంగా వాదించాలని సూచించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు.. విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.