తెలంగాణలో మిస్సింగ్ కేసులు పెరిగిపోతున్నాయని గతంలో న్యాయవాది భాస్కర్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్‌చౌహాన్, జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు ఎనిమిది వేల అదృశ్యం కేసులు నమోదయ్యాయని.. ఇటీవల రెట్టింపు అయ్యాయని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. ఎక్కువగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినవారే అదృశ్యమవుతున్నారని పేర్కొన్నారు.
అదృశ్యం కేసులను ఛేదించేందుకు షీబృందాలు, దర్పన్ యాప్, మహిళా భద్రత విభాగం, ఆపరేషన్ ముస్కాన్ తదితర విభాగాలు, కార్యక్రమాల ద్వారా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు? భవిష్యత్తు ప్రణాళిక వివరిస్తూ డిసెంబర్ 3లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 10కి వాయిదా వేసింది.
ఇదీ చదవండిః ధరణిపై హైకోర్టు కీలక ఆదేశాలు... నమోదుపై మధ్యంతర ఉత్తర్వులు