ETV Bharat / state

అంతర్రాష్ట్ర జల వివాదంపై విచారణ జరపలేం: హైకోర్టు

Krishna Water Dispute : అంతర్రాష్ట్ర జలవివాదాలపై విచారణ జరపలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. జల విద్యుత్ ఉత్పత్తిపై తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ రైతులు గతేడాది దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు విచారణ ముగించింది.

Telangana High Court
Telangana High Court
author img

By

Published : Feb 15, 2022, 10:45 PM IST

Krishna Water Dispute : అంతర్రాష్ట్ర జలవివాదాలపై విచారణ జరపలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అన్ని జల విద్యుత్ ప్రాజెక్టుల్లో పూర్తిస్థాయి ఉత్పత్తి చేసేలా గతేడాది జూన్​లో తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సర్కారు జీవోలను సవాల్ చేస్తూ కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు రైతులు హైకోర్టును ఆశ్రయించారు.

అంతర్రాష్ట్ర జలవివాదాలపై విచారణ జరపలేమని.. సుప్రీంకోర్టు లేదా ప్రత్యేక కోర్టులకే ఆ పరిధి ఉంటుందని తెలంగాణ సీజే జస్టిస్ సతీశ్​ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం పేర్కొంది. పిటిషన్​పై విచారణ ముగించిన ధర్మాసనం.. చట్టపరమైన ప్రత్యామ్నాయాలను చూసుకోవాలని సూచించింది.

ఇదీ చూడండి : గోదావరి-కావేరి అనుసంధానంపై ఈనెల 18న జలశక్తి శాఖ కీలక భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.