ETV Bharat / state

ఉద్యోగుల విభజనను కోర్టులు చెబితేగానీ చేయరా..?: హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా వివిధ సంస్థల ఆస్తులు, అప్పులు విభజనలో జరుగుతున్న జాప్యంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలోని ఇంటర్మీడియట్‌ బోర్డుల ఉద్యోగుల విభజన చేయకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై... ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఉద్యోగుల విభజనను కోర్టులు చెబితేగానీ చేయరా..?: హైకోర్టు
ఉద్యోగుల విభజనను కోర్టులు చెబితేగానీ చేయరా..?: హైకోర్టు
author img

By

Published : Feb 23, 2021, 5:01 AM IST

ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా వివిధ సంస్థల ఆస్తులు, అప్పులు విభజనలో జరుగుతున్న జాప్యంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉద్యోగుల విభజనను కోర్టులు చెబితేగానీ చేయరా అంటూ ప్రశ్నించింది. ఉమ్మడి రాష్ట్రంలోని ఇంటర్మీడియట్‌ బోర్డుల ఉద్యోగుల విభజన చేయకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై... హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. బోర్డుకు చెందిన ఉద్యోగుల విభజనకు కొంత గడువు కావాలని... ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు.

విభజనకు సంబంధించి మరో కేసులో ఇదే కోర్టు తీర్పు వెలువరించిందని... విభజనకు మూడు నెలల గడువు ఇచ్చిందన్నారు. ఈలోగా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం... ఒక సంస్థకు సంబంధించి ఇచ్చిన గడువును మరో సంస్థకు వర్తింపజేయడాన్ని ప్రశ్నించింది. ప్రతి సంస్థ ఇలాగే గడువు కోరితే ఎలాగని నిలదీసింది. రెండు రాష్ట్రాల బోర్డు అధికారులు కూర్చుని మాట్లాడుకుని పరస్పర అవగాహనతో పరిష్కరించుకుంటే సరిపోతుందని.. దీనికి ప్రభుత్వాలతో పనేంటని ప్రశ్నించింది. ఉద్యోగుల ఇబ్బందులపై ఎలాంటి ఉద్వేగాలు లేని ఏలియన్స్‌లా వ్యవహరిస్తే ఎలాగన్న హైకోర్టు... న్యాయస్థానాలు జోక్యం చేసుకుని పరిష్కరిస్తాయంటూ పట్టనట్టు వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోందని పేర్కొంది. ఇలాగే వ్యవహారిస్తే భారీగా జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ తీర్పును వాయిదా వేసింది.

ఇదీ చూడండి: రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల సందడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.