ETV Bharat / state

'ఈనెల 17లోగా వేతనాలు, పెన్షన్ల కోతపై వివరణ ఇవ్వండి' - తెలంగాణ హైకోర్టు

ఉద్యోగుల వేతనాలు, పదవీ విరమణ పొందిన వారి పెన్షన్ల కోతపై ఈ నెల 17లోగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

telangana-high-court-ask-description-to-government
'ఈనెల 17లోగా వేతనాలు, ఫించన్ల కోతపై వివరణ ఇవ్వండి'
author img

By

Published : Apr 8, 2020, 5:19 PM IST

ఉద్యోగుల వేతనాలు, ఉద్యోగ విరమణ చేసిన వారి పెన్షన్లపై కోత విధించడం రాజ్యాంగ విరుద్ధమని సీనియర్ న్యాయవాదులు రాసిన లేఖలను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అమర్ నాథ్​తో కూడిన ధర్మాసనం ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. ఈనెల 17లోగా దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది.

కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి తగిన భద్రత కల్పించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ... న్యాయవాది కరుణ సాగర్ రాసిన లేఖను కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన ధర్మాసనం... ఈనెల 17లోగా కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటీవల గాంధీలో వైద్యులపై జరిగిన దాడిని సైతం ప్రస్తావించింది.

ప్రజలు గుమిగూడుతున్న ప్రాంతాల్లో వైరస్, బ్యాక్టీరియాను నిర్మూలించే టన్నెల్​లను ఏర్పాటు చేసేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాది జి.రోనాల్డ్ రాజు రాసిన మరో లేఖను కూడా హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీనిపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

ఇవీ చూడండి: లాక్​డౌన్​ ముగిశాక 'వుహాన్​' ప్రజలు ఏం చేస్తున్నారు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.