ETV Bharat / state

మార్చి 1 నుంచి మూడోదశ కరోనా టీకాల పంపిణీ

మూడో దశలో 55 లక్షల మందికి వేయడానికి రాష్ట్ర వేయడానికి వైద్యఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో 60 ఏళ్లు పైబడినవారు 45 లక్షల మంది.. 45-60 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు 10 లక్షల మంది ఉంటారని అంచనా వేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6 లక్షల డోసులు అందుబాటులో ఉండగా.. మరో 10 లక్షల డోసులు రానున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

telangana health department will vaccination to 55 lakhs people in  third phase
మార్చి 1 నుంచి మూడోదశ కరోనా టీకాల పంపిణీ
author img

By

Published : Feb 25, 2021, 7:05 AM IST

మార్చి 1 నుంచి మూడోదశ కరోనా టీకాల పంపిణీకి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో.. రాష్ట్రంలో దాదాపు 55 లక్షల మందికి వేయడానికి వైద్యఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో 60 ఏళ్లు పైబడినవారు 45 లక్షల మంది.. 45-60 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు 10 లక్షల మంది ఉంటారని అంచనా వేసింది. వీరందరికీ దశల వారీగా ఇచ్చేందుకు మొత్తం 1,500 కేంద్రాలను నెలకొల్పాలని నిర్ణయించింది. ప్రస్తుతంరాష్ట్రంలో 6 లక్షల డోసులు అందుబాటులో ఉండగా.. మరో 10 లక్షల డోసులు రానున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

14 లక్షల మంది తగ్గారు...

కేంద్ర ప్రభుత్వం తొలుత సుమారు 3.5 లక్షల మంది వైద్యసిబ్బందికి; 2.5 లక్షల మంది పోలీసు, రెవెన్యూ, పురపాలక, పంచాయతీరాజ్‌ సిబ్బందికి; 50 ఏళ్లు పైబడిన 65 లక్షల మందికి; 18-50 ఏళ్ల మధ్యవయస్కుల్లో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైన 4 లక్షల మందికి.. మొత్తంగా రాష్ట్రంలో సుమారు 75 లక్షల మందికి టీకాలు ఇవ్వాల్సి ఉంటుందని ప్రకటించింది. తాజాగా కొన్ని మార్పులు చేసింది. 50 ఏళ్లు పైబడిన వారికి బదులుగా 60 ఏళ్లు పైబడినవారిని తీసుకోవాలని సూచించింది. అలాగే 18-50 ఏళ్ల మధ్యవయస్కులకు మారుగా 45-60 ఏళ్ల మధ్యవయస్కులని పేర్కొంది. ఆ ప్రకారం చూస్తే గతంలో కంటే దాదాపు 14 లక్షల మంది టీకాలకు అర్హత కోల్పోయారని వైద్యవర్గాలు విశ్లేషించాయి.

సరళీకరణ ఇలా..

* కొత్త యాప్‌లో వయసు ధ్రువీకరణకు ఆధార్‌ కార్డు, ఓటరుకార్డు సహా 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి అప్‌లోడ్‌ చేయాలి.

* దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైతే సంబంధిత వైద్యుని ధ్రువపత్రాన్ని జతపర్చాలి.

* ఏ కేంద్రంలో టీకా పొందాలనుకుంటున్నారో సొంతంగా ఎంపిక చేసుకోవచ్చు.

* ఏ తేదీన, ఏ సమయానికి రావాలో ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. పాస్‌వర్డ్‌ కూడా వస్తుంది.

* కేంద్రానికి ఒరిజినల్‌ గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. వ్యాధిగ్రస్తులైతే సంబంధిత ధ్రువపత్రాన్నీ తీసుకెళ్లాలి. పాస్‌వర్డ్‌ చూపాలి.

* స్వీయ నమోదుకు అవకాశం లేనివారు నేరుగా కేంద్రాలకు వెళ్లి టీకా వేయించుకోవచ్చు. సంబంధిత ధ్రువపత్రాలను చూపితే ఆ కేంద్రంలో సిబ్బందే యాప్‌లో నమోదు చేస్తారు.

ఆరోగ్యశ్రీ అనుసంధాన ఆసుపత్రుల్లోనూ...

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ, ఆరోగ్యశ్రీ ట్రస్టుతో అనుసంధానమైన 230 ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనూ టీకా కేంద్రాలను నెలకొల్పాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. వీటితో పాటు రాష్ట్రంలోని 1,000 గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, బస్తీ దవాఖానాల్లోనూ ఇవ్వనున్నారు. ఏ టీకా అందుబాటులో ఉంటే అదే టీకాను పొందాల్సి ఉంటుందని ప్రజారోగ్య సంచాలకుడు (డీహెచ్‌) డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు.

నమోదు చేసుకున్న వారికి ఇక 4 రోజులే

రాష్ట్రంలో తొలిడోసు టీకా కోసం నమోదు చేసుకొని ఇంకా తీసుకోని వారికి ఆఖరి విడతగా అవకాశం ఇవ్వాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. గురువారం నుంచి ఈ నెలాఖరు వరకూ 4 రోజుల పాటు అందించడానికి ఏర్పాట్లు చేశారు. ప్రాధాన్యక్రమంలో తీసుకోవడానికి ఇదే ఆఖరి అవకాశమనీ, తర్వాత తీసుకోవాలనుకుంటే ఇతరుల మాదిరిగానే పొందాల్సి ఉంటుందని డీహెచ్‌ స్పష్టం చేశారు.

ఒకట్రెండు రోజుల్లో కొవిన్‌ 2.0 యాప్‌

ఇప్పటి వరకూ కొవిన్‌ వెబ్‌ యాప్‌ సాయంతో టీకాలు పొందే వారి సమాచారాన్ని పొందుపరుస్తున్నారు. ఇలా పొందుపర్చడం వైద్యసిబ్బందికి తలకు మించిన భారమవుతోంది. ఆ యాప్‌ ఇక్కట్లకు స్వస్తి పలుకుతూ కేంద్రం నూతనంగా కొవిన్‌ 2.0 పేరిట మరో యాప్‌ తెచ్చింది. ఒకట్రెండు రోజుల్లోనే సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది.

ఇదీ చదవండి: ఉద్యోగాల భర్తీపై ఏ చర్చకైనా సిద్ధం... కేటీఆర్ సవాల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.