TSPSC Group1 Final Key Release : తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు సంబంధించి తుది కీను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. జూన్ 28న గ్రూప్1కు సంబంధించి.. ప్రాథమిక పరీక్ష నిర్వహించగా.. ఇప్పటికే ప్రాథమిక కీను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను విడుదల చేసింది. దీనిపై అభ్యర్థుల అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం ఇవాళ తుది కీను విడుదల చేశారు.
గ్రూప్1న ప్రాథమిక పరీక్షకు సంబంధించి 2,33,056 మంది అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లును టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో ఇది వరకే ఉంచింది. జులై 1నుంచి జులై 5 వరకు ఆన్లైన్లో అభ్యంతరాలు స్వీకరించింది. అభ్యర్థుల అభ్యంతరాల అనంతరం ఇవాళ తుది కీను పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కారణంగా గతేడాది అక్టోబర్ 16న జరగాల్సిన గ్రూప్1 పరీక్ష.. ఎట్టకేలకు ఈ ఏడాది జూన్ 28న టీఎస్‌పీఎస్సీ పక్బంధీగా నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 994 పరీక్షా కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు. మొత్తం 503 పోస్టులకు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
- TSPSC Group 1 Results 2023 : ఫలితాలను వెల్లడించేలా టీఎస్‌పీఎస్సీ కసరత్తు.. ప్రత్యేక ప్రణాళిక షురూ
- TSPSC Group 1 Results : 'అప్పటి వరకు.. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు ఇవ్వం'
Telangana Group1 EXAM : టీఎస్‌పీఎస్సీ గ్రూప్1 ప్రిలిమరీ ప్రాథమిక కీని విడుదల చేసిన కమిషన్.. త్వరలోనే ప్రిలిమరీ ఫలితాలు విడుదల చేయనుంది. ప్రధాన పరీక్షకు 3 నెలల సమయం ఇచ్చి మెయిన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనుంది. ఈ నేపథ్యంలో అక్టోబరు లేదా నవంబరు నెలల్లో గ్రూప్-1 ప్రధాన పరీక్ష ఉండే అవకాశం ఉంది. ఈ సారి గ్రూప్-1 పరీక్షను గతంలో రాసిన పరీక్ష కంటే 50 వేల మంది తక్కువ రాసినట్లు టీఎస్‌పీఎస్సీ పేర్కొంది.
టీఎస్‌పీఎస్సీలో సంస్కరణలు: ప్రశ్నాపత్రాల లీకేజీ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ పలు మార్పులకు శ్రీకారం చుట్టుంది. కమిషన్ ఉద్యోగులు ఎవరైనా పరీక్షలు రాస్తే వారికి నిర్బంధ సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. గ్రూప్-1 పునఃపరీక్షకు పది మంది ఉద్యోగులు దరఖాస్తు చేయగా వారితో పరీక్షకు ముందు రెండు నెలలు.. పరీక్ష తరువాత 10 రోజుల పాటు వారికి సెలవులు పెట్టించారు. తర్వాత జరగబోయే మిగతా పరీక్షలకు కూడా ఇదే పద్ధతిని అనుసరించాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
పేపర్ లీకేజీ కేసులో అరెస్టుల సంఖ్య 74: మరోవైపు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేపర్ లీక్ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి జూలై రెండో వారంలో మరో 19 మందిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఇప్పటివరకు అరెస్టు చేసిన వారి సంఖ్య 74కు చేరింది. పోల రమేశ్ ఏఈ ప్రశ్నాపత్రం ఇవ్వడం కోసం.. ఒక్కొక్కరి వద్ద రెండు లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు ఆధికారులు గుర్తించారు. వరంగల్‌లో ఏఈగా పనిచేసిన పోల రమేశ్... కొద్దిరోజుల క్రితం హైటెక్ మాస్ కాపీయింగ్ వ్యవహారంలో అరెస్టు అయ్యాడు.
ఇవీ చదవండి: