ETV Bharat / state

వాహనదారులకు శుభవార్త - పెండింగ్​ ట్రాఫిక్​ చలాన్ల రాయితీ గడువు పెంపు - Traffic Challan deadline

Telangana Govt has Extended the Deadline for Traffic Challans Till January 31 : పెండింగ్​ ట్రాఫిక్​ చలాన్ల రాయితీ గడువును రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 31 వరకు పెంచింది. ఇప్పటికే పెండింగ్​ చలాన్ల చెల్లింపుల ద్వారా రూ.107 కోట్ల ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు. అధికారుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం గడువును మరో 20 రోజుల వరకు పెంచింది.

Telangana Traffic Challan
Telangana Traffic Challan Discounts
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 10, 2024, 6:25 PM IST

Updated : Jan 10, 2024, 9:23 PM IST

Telangana Govt has Extended the Deadline for Traffic Challans Till January 31 : పెండింగ్​ ట్రాఫిక్​ చలాన్లు కట్టే వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను రాయితీపై చెల్లించేందుకు ఈనెల 31 వరకూ గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది. కోవిడ్ తర్వాత ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు కలిగాయని, చలాన్లు మరింత భారం అవ్వకుండా ఉండేందుకు ప్రభుత్వం రాయితీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరో వైపు చలాన్లను చెల్లించేదుకు విశేష స్పందన రావడంతో గడువు(Traffic Challana Extend Date in Telangana) పెంచుతున్నట్లు తెలిపింది.

మొత్తం 3.59కోట్ల పెండింగ్ చలన్లు ఉండగా గత నెల 26నుంచి ఇప్పటి వరకూ తెలంగాణ వ్యాప్తంగా 1.29కోట్ల చలాన్ల చెల్లింపులకు సంబంధించి రూ.113 కోట్ల ఆదాయం వచ్చినట్లు పోలీసులు అధికారులు తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 37,50లక్షల చలాన్ల చెల్లింపులకు గాను రూ.28.70 కోట్లు, సైబరాబాద్ లో 21.25లక్షల చలాన్లకు రూ.23.65 కోట్లు,రాచకొండ కమిషనరేట్ పరిధిలో 16.60లక్షల చలాన్లు కు గాను రూ.13.35 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రజలంతా చలాన్ల కోసం పెంచిన ఈ 20 రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఫైన్​లైనా కడతాం కానీ రూల్స్​ పాటించం - గంటకు 1,731 ట్రాఫిక్​ ఉల్లంఘనల కేసులు

Telangana Traffic Challan Discounts : అంతకు ముందు రాయితీపై పెండింగ్​ చలాన్ల చెల్లింపుల గడువును పెంచాలని పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే చలాన్లను కట్టేందుకు విశేష స్పందన రావడంతో గడువును పెంచాలనుకున్నారు. వీటితో పాటు సాంకేతిక సమస్యలు ఎదురవడంతో చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయని రవాణా శాఖ తెలిపింది. గతంలో వాహనదారులకు ఈ చలానాపై భారీగా రాయితీ ఇచ్చింది. అవి

  • తోపుడు బళ్లు, ఆర్టీసీ బస్సులు వారికి 90 శాతం
  • ద్విచక్ర వాహనాల చలాన్లపై 80 శాతం
  • ఫోర్ వీలర్స్, ఆటోల చలాన్లపై 60 శాతం
  • లారీలు, ఇతర భారీ వాహనాల చలాన్లపై 50 శాతం డిస్కౌంట్ ఇస్తూ అనుమతులు జారీ చేసింది. ఆన్‌లైన్‌, మీ సేవా కేంద్రాల్లో చలాన్లు చెల్లించే అవకాశాన్ని కల్పించింది. రాష్ట్రంలో పెండింగ్ చలానాలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో లైసెన్స్​ లేకుండా వాహనాలు నడపడం, రాంగ్​ రూట్​లో వెళ్లడం, హెల్మట్​ లేకుండా డ్రైవ్​ చేయడం, మద్యం తాగి వాహనాలు నడపడం తదితర నిబంధనలను కొంత మంది వాహనదారులు పాటించటం లేదు. దీంతో ట్రాఫిక్​ చలాన్లు ఎక్కువ అవుతున్నాయి. ఒక్కో వాహనంపై అధిక సంఖ్యలో చలానాలు పెండింగ్‌(Pending Challana in Telangana)లో ఉన్నాయని తెలుస్తోంది.

Traffic Challans Cases in Telangana 2023 : తెలంగాణలో రోజు ట్రాఫిక్​ ఉల్లంఘనలు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గతేడాది 2023 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో సగటున ప్రతి గంటకు 1,731 చొప్పున ట్రాఫిక్​ ఉల్లంఘనలు జరిగాయని రవాణా శాఖ తెలిపింది. గత సంవత్సరం 1,51,63,986 కేసులు నమోదయ్యాయి. వీటికి విధించిన జరిమానాలు రూ.519 కోట్లు పైమాటే.

పెండింగ్‌ చలాన్లపై మరోసారి భారీ డిస్కౌంట్ - ఈ నెల 26 నుంచి ఛాన్స్

Last Updated : Jan 10, 2024, 9:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.