Palle Pattana Pragathi Program Begins: రాష్ట్రవ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభమైంది. గ్రామాలు, పట్టణాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రగతి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఐదో విడత, పట్టణ ప్రాంతాల్లో నాలుగో విడత పనులను ప్రారంభించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల పెరుగుదల... పారిశుద్ధ్యం, పచ్చదనం మెరుగుదలే లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని సీఐబీ క్వార్టర్స్ వద్ద... ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి ప్రగతి కార్యక్రమాన్ని తలసాని ప్రారంభించారు. ఇంటింటికి తిరుగుతూ పట్టణ ప్రగతిపై అవగాహన కల్పించారు. 15 రోజుల పాటు జరిగే పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని మంత్రి కోరారు.
-
Launched Pattana Pragathi program in Jubilee Hills Assembly Constituency along with MLA Maganti Gopinath Garu & Other Dignitaries. pic.twitter.com/4DlzLaGa8D
— Talasani Srinivas Yadav (@YadavTalasani) June 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Launched Pattana Pragathi program in Jubilee Hills Assembly Constituency along with MLA Maganti Gopinath Garu & Other Dignitaries. pic.twitter.com/4DlzLaGa8D
— Talasani Srinivas Yadav (@YadavTalasani) June 3, 2022Launched Pattana Pragathi program in Jubilee Hills Assembly Constituency along with MLA Maganti Gopinath Garu & Other Dignitaries. pic.twitter.com/4DlzLaGa8D
— Talasani Srinivas Yadav (@YadavTalasani) June 3, 2022
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సర్దార్ నగర్‌లో 5వ విడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని మంత్రి సబితా రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ క్రీడప్రాంగణాన్ని ప్రారంభించి, జడ్పీ ఉన్నత పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో మరో దఫా పల్లె, పట్టణ ప్రగతి పనులకు మంత్రి పువ్వాడ అజయ్ శ్రీకారం చుట్టారు. జీకే బంజార పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. బంధనపల్లి చెరువులో పూడికతీత పనులు పరిశీలించారు. రాయపర్తి మండలం కొత్తూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
-
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బంధన్ పల్లి చెరువులో ఉపాధి హామీ పథకం కింద పూడికతీత పనులు చేస్తున్న కూలీలను పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. pic.twitter.com/mJGcUUE21Z
— Errabelli DayakarRao (@DayakarRao2019) June 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బంధన్ పల్లి చెరువులో ఉపాధి హామీ పథకం కింద పూడికతీత పనులు చేస్తున్న కూలీలను పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. pic.twitter.com/mJGcUUE21Z
— Errabelli DayakarRao (@DayakarRao2019) June 3, 2022వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బంధన్ పల్లి చెరువులో ఉపాధి హామీ పథకం కింద పూడికతీత పనులు చేస్తున్న కూలీలను పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. pic.twitter.com/mJGcUUE21Z
— Errabelli DayakarRao (@DayakarRao2019) June 3, 2022
మంచిర్యాలలో పట్టణ ప్రగతి కార్యక్రమాలకు జిల్లా పాలనాధికారి భారతి హోలీకేరీతో కలిసి ఎమ్మెల్యే దివాకర్‌రావు శ్రీకారం చుట్టారు. పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగం కావాలన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. పలు వీధుల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పట్టణ ప్రగతి పనుల్లో పాల్గొన్నారు. మెట్‌పెల్లి మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో కలెక్టర్‌తో కలిసి ప్రగతి పనులను ప్రారంభించారు.
-
#PallePragati, #PattanaPragati కార్యక్రమంలో భాగంగా @MC_Khammam కార్పోరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో ఉదయాన్ని సైకిల్ పై @Collector_KMM, #Mayor, #MuncipalCommissioner తో కలిసి పర్యటించి చేపట్టాల్సిన పనులు, కొనసాగుతున్న పనులను పరిశలించడమైంది(1/2). @TelanganaCMO @MinisterKTR @KTRTRS pic.twitter.com/TWORq0I4SV
— Ajay Kumar Puvvada (@puvvada_ajay) June 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">#PallePragati, #PattanaPragati కార్యక్రమంలో భాగంగా @MC_Khammam కార్పోరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో ఉదయాన్ని సైకిల్ పై @Collector_KMM, #Mayor, #MuncipalCommissioner తో కలిసి పర్యటించి చేపట్టాల్సిన పనులు, కొనసాగుతున్న పనులను పరిశలించడమైంది(1/2). @TelanganaCMO @MinisterKTR @KTRTRS pic.twitter.com/TWORq0I4SV
— Ajay Kumar Puvvada (@puvvada_ajay) June 3, 2022#PallePragati, #PattanaPragati కార్యక్రమంలో భాగంగా @MC_Khammam కార్పోరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో ఉదయాన్ని సైకిల్ పై @Collector_KMM, #Mayor, #MuncipalCommissioner తో కలిసి పర్యటించి చేపట్టాల్సిన పనులు, కొనసాగుతున్న పనులను పరిశలించడమైంది(1/2). @TelanganaCMO @MinisterKTR @KTRTRS pic.twitter.com/TWORq0I4SV
— Ajay Kumar Puvvada (@puvvada_ajay) June 3, 2022
ఇవీ చదవండి: