Telangana Govt Approves Vehicle Movement Subsidy : రాష్ట్రంలో వాహనాల చలానా రాయితీలకు అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇది ఈ నెల 26 నుంచి జనవరి 10 వరకు డిస్కౌంట్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. గత సంవత్సరం ఇచ్చిన రాయితీ వల్ల పెండింగ్‌లో ఉన్న చలానాలు రూ.300 కోట్లు వరకూ వసూలయ్యాయి. దీంతో ఇదే తరహాలో మరోసారి భారీగా రాయితీ ఇస్తూ ప్రభుత్వం ప్రకటించింది.
Discount on Traffic Pending Challans in Telangana : రాష్ట్రంలో ట్రాఫిక్ రూల్స్(Traffic Rules in Hyderabad) ఉల్లంఘించే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ వస్తోంది. నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు ఎంత చెప్పినా వాహనదారులు మాత్రం ఆ మాటలు పెడచెవిన పెడుతున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, రాంగ్ రూట్లో వెళ్లడం, హెల్మట్ లేకుండా డ్రైవ్ చేయడం, మద్యం తాగి వాహనాలు నడపడం తదితర నిబంధనలను పాటించట్లేదు. దీంతో ట్రాఫిక్ చలాన్లు అధికం అవుతున్నాయి. ఒక్కో వాహనంపై పదుల సంఖ్యలో చలానాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలుస్తోంది.
Telangana E Challan Discount 2023 : వాహనదారులు మాత్రం చలాన్లు పడుతున్నా, వాటిని కట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో పెండింగ్ చలానాలు పెరుగుతున్నాయి. 2022లో పెండింగ్‌లో ఉన్న చలాన్లను క్లియర్ చేసేందుకు రాష్ట్ర ట్రాఫిక్ పోలీసులు 70 శాతం రాయితీ ఇచ్చారు. ప్రస్తుతం గతంలో కంటే భారీగా రాయితీ ఇచ్చింది.
- ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల వారికి 90 శాతం
- ద్విచక్ర వాహనాల చలాన్లపై 80 శాతం
- ఫోర్ వీలర్స్, ఆటోల చలాన్లపై 60 శాతం
- లారీలు, ఇతర భారీ వాహనాల చలాన్లపై 50 శాతం డిస్కౌంట్ ఇస్తూ అనుమతులు జారీ చేసింది. ఆన్‌లైన్, మీ సేవా కేంద్రాల్లో చలాన్లు చెల్లించే అవకాశాన్ని కల్పించింది.
Discount on Telangana E Challan 2023 : మార్చి 31 2022 నాటికి రాష్ట్రంలో 2.4 కోట్ల చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే వీటిని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో గత ఏడాది ప్రత్యేక రాయితీ(Discount of Traffic Challans) ఇచ్చారు. ద్విచక్ర వాహనాలకైతే 75 శాతం, మిగతా వాటికి 50 శాతం రాయితీ ప్రకటించారు. ఈ క్రమంలో దీనికి అనూహ్య స్పందన వచ్చింది. దాదాపు 65 శాతం మంది చలానాలు చెల్లించారు. ఆ తర్వాత మళ్లీ యథాతథంగా పెండింగ్ భారం పెరిగిపోయింది. గత నెలాఖరుకు చలానాల సంఖ్య మళ్లీ 2 కోట్లకు చేరుకుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో మరోమారు రాయితీ ప్రకటించారు. ఈ చలానాను echallan.tspolice.gov.in వెబ్సైట్ వెహికల్ నంబర్ ఎంటర్ చేసి చెల్లించవచ్చు.
కోఠిలో మహిళ హల్చల్.. నా కారుకే చలానా వేస్తావా అంటూ ఫైర్..!
పెండింగ్ చలానా చెల్లింపులో వివాదం
e-Challan Frauds in Hyderabad : ఈ-చలానా మెసేజ్ మీకూ వచ్చిందా.. అయితే బీ కేర్ఫుల్