Telangana Govt Approves Compassionate Appointments in TSRTC : పదేళ్లుగా ఆర్టీసీలో కండక్టర్ కారుణ్య నియామకాల(Karunya Niyamakalu) కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కారుణ్య నియామకాల కింద 813 మందిని కండక్టర్లుగా తీసుకోవడానికి రంగం సిద్ధం చేసింది. టీఎస్ఆర్టీసీలో పని చేస్తూ విధి నిర్వహణలో మరణించిన సిబ్బంది వారసులకు కారుణ్య నియామకాల కింద కండక్టర్(Conductor Posts) పోస్టులను ఇవ్వాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అధికారులకు ఆదేశించారు.
బ్రెడ్ విన్నర్( కారుణ్య నియామకాలు), మెడికల్ ఇన్వాలిడేషన్ స్కీమ్ కింద ఉద్యోగుల జీవిత భాగస్వామి లేదా పిల్లలకు ప్రత్యామ్నాయ ఉపాధిని అందించడానికి వారి విద్యార్హతల ప్రకారం ఉద్యోగాలు కల్పిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సర్వీసులో ఉండగా మరణించిన సంస్థ సిబ్బంది కుటుంబాలకు ఇదొక ఊరట కలిగించనుందని చెప్పారు. ఈ కారుణ్య నియామకాలను హైదరాబాద్(66), సికింద్రాబాద్ (126). రంగారెడ్డి (52), నల్గొండ (56), మహబూబ్‌నగర్ (83), మెదక్ (93), వరంగల్ (99), ఖమ్మం (53), అదిలాబాద్ (71), నిజామాబాద్ (69), కరీంనగర్ (45) రీజియన్ల నుంచి మొత్తం 813 కండక్టర్ పోస్టులను సంస్థ భర్తీ చేయనుంది.
TSRTC Compassionate Appointments : ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే 10 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న టీఎస్ఆర్టీసీ(TSRTC) కండక్టర్ నియామకాలు చేపట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దానిలో భాగంగా 813 మంది కండక్టర్లను నియమించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. చాలా సంవత్సరాలుగా కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు న్యాయం జరగనుందని, రాష్ట్ర ప్రభుత్వం వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
ఆర్టీసీలో కారుణ్య నియామకాలు.. వారి కుటుంబాలకే ప్రాధాన్యం..
Telangana Govt has Decided to Purchase 275 New RTC Buses : మహాలక్ష్మీ మహిళల ఉచిత ప్రయాణానికి(MahaLakshmi Scheme) మహిళల నుంచి అనూహ్య స్పందన వస్తున్న నేపథ్యంలో ప్రయాణికులకు మరిన్ని బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 275 కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ఆర్టీసీ 80 బస్సులను ప్రారంభించింది. ఈ ఏడాది జులై నాటికి మరో 1000 బస్సులు రోడ్డెక్కనున్నాయని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మహాలక్ష్మీ పథకం అమలు చేశామని ఈ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి మంచి స్పందన వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఇప్పటి వరకు దాదాపు 9 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారన్నారు. మహాలక్ష్మి పథకం కింద రోజురోజుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండడంతో జులై నెలలోపు అందుబాటులోకి తీసుకురానున్న 1,000 బస్సులకు అదనంగా మరో 275 కొత్త బస్సుల కొనుగోలు చేసేందుకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బస్సులో ప్రయాణం చేసే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు.
ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ షాక్ - ఆ టికెట్లు రద్దు
పురుషుల కోసం టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు- సీనియర్ సిటిజన్లకే తొలి ప్రాధాన్యం