ETV Bharat / state

రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్‌ చర్యలపై సర్వత్రా ఉత్కంఠ - తెలంగాణ ప్రభుత్వం

Telangana Governor What Next Plan: తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్​కు మధ్య వివాదం జరుగుతోందన్న విషయం తెలిసిందే.. అయితే ఫిబ్రవరి 3నుంచి శాసనసభ బడ్జెట్​ సమావేశాలు జరుగనున్నాయి. ఈసారి ఎలా ఉంటుందో అని తెలంగాణ ప్రజానికం మొత్తం వెచిచూస్తుంది.

Telangana Governor
గవర్నర్​
author img

By

Published : Jan 22, 2023, 8:54 AM IST

Telangana Governor What Next Plan: బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారైన తరుణంలో ఇప్పుడు గవర్నర్‌ తమిళిసై ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా తన ప్రసంగం లేకపోవడంపై గత ఏడాది తీవ్ర వ్యాఖ్యలు చేసిన తమిళిసై.. ఈసారి ఎలా స్పందిస్తారని ఉత్కంఠ రేపుతోంది. ఉభయ సభలు ఆమోదించిన బిల్లులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోని గవర్నర్‌.. బడ్జెట్ విషయంలో ఏం చేస్తారన్నది ఇప్పుడు చర్చనేయాంశమైంది.

రాష్ట్రంలో గవర్నర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య దూరం బాగా పెరిగింది. గత గణతంత్ర దినోత్సవం, బడ్జెట్ సమావేశాల సందర్భంగా విభేదాలు బహిరంగంగా వ్యక్తమయ్యాయి. తాజాగా మళ్లీ ఈ ఏడాది గణతంత్ర దినోత్సవంతో పాటు బడ్జెట్ సమావేశాలు సమీపించాయి. బడ్జెట్ సమావేశాల ముహూర్తాన్ని వచ్చే నెల మూడో తేదీగా రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. గత సమావేశాల కొనసాగింపుగానే ఉభయ సభలు ఈసారి కూడా సమావేశం అవుతున్నాయి.

Telangana Budget meetings On Feb3: దీంతో గవర్నర్‌తో సంబంధం లేకుండానే ప్రభుత్వ నిర్ణయం మేరకు శాసనసభ సచివాలయం సభ్యులకు సమాచారం పంపింది. ఉభయ సభలను ప్రోరోగ్ చేయకపోవడంతో కొత్త సమావేశాలు కాకుండా గత సమావేశాలను కొనసాగించారు. దీంతో ఈసారీ ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించే అవకాశం లేదు. నిరుడు బడ్జెట్ సమావేశాల్లోనూ గవర్నర్‌ ప్రసంగం లేదు. ఈ విషయంపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ బహిరంగంగానే రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టారు.

కేవలం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇస్తున్నట్లు అప్పట్లో ఆమె ప్రకటన కూడా ఇచ్చారు. తాజా బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా గవర్నర్‌ ప్రసంగానికి అవకాశం లేకుండా పోయింది. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఈ సారి తమిళిసై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. గణతంత్ర దినోత్సవంతో పాటు బడ్జెట్ సమావేశాలకు సంబంధించి తనకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని... గవర్నర్‌ రెండు రోజుల క్రితం బహిరంగంగానే వ్యాఖ్యానించారు.

ఈ పరిస్థితుల్లో బడ్జెట్ విషయంలో ఏం చేస్తారన్నది చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఉభయసభలు ఆమోదించిన బిల్లులు రాజ్‌భవన్‌లోనే పెండింగ్‌లోనే ఉన్నాయి. 4 నెలలు గడిచినప్పటికీ బిల్లులపై గవర్నర్‌ తమిళిసై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ పరిస్థితుల్లో బడ్జెట్ విషయంలో ఏం చేస్తారన్నది చూడాలి. అటు ఈనెల 26న గణతంత్ర దినోత్సవాలు ఎక్కడ నిర్వహిస్తారన్న విషయంపైనా ఇప్పటికీ అధికారిక ప్రకటన లేదు.

గవర్నర్​ తెలంగాణ ప్రభుత్వాల మధ్య వివాదం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.