Telangana Govt Advisers Appointments Cancelled : తెలంగాణ రాష్ట్ర గత ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులను జారీ చేశారు. ఏడుగురి సలహాదారుల నియామకాలు రద్దు(Advisers Appointments Cancelled) చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సోమేశ్‌కుమార్, చెన్నమనేని రమేష్, రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, ఏకే ఖాన్ నియామకాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అలాగే జీఆర్ రెడ్డి, ఆర్.శోభ నియామకాలను కూడా రద్దు చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
గత ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నవారి నియామకాలు రద్దు :
- మైనారిటీ వెల్ఫేర్‌కు ప్రభుత్వ సలహాదారుడు - ఏకే ఖాన్
- ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడు - సోమేశ్ కుమార్
- వ్యవసాయ వ్యవహారాలపై ప్రభుత్వ సలహాదారుడు(కేబినెట్ ర్యాంకు) - చెన్నమనేని రమేశ్
- ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు - రాజీవ్ శర్మ
- ప్రభుత్వ సలహాదారుడు - అనురాగ్ శర్మ
- ప్రభుత్వ సలహాదారుడు - జీఆర్ రెడ్డి
- ప్రభుత్వ సలహాదారురాలు - శోభ
సీఎం హోదాలో తొలిసారి దిల్లీకి రేవంత్ రెడ్డి - మల్కాజ్గిరి ఎంపీగా రాజీనామా
Several Corporations Chairman Resigned in Telangana : తెలంగాణలో కాంగ్రెస్‌కు మెజార్టీ సీట్లు వచ్చినప్పటి నుంచి కార్పొరేషన్ ఛైర్మన్లు రాజీనామాలు చేస్తూ వచ్చారు. కార్పొరేషన్ ఛైర్మన్లు, ఇతర నామినేటెడ్ పదవులలో ఉన్న బీఆర్ఎస్ నేతలు కూడా రాజీనామా చేశారు. ఇప్పటివరకు 16 మంది నేతలు వారి రాజీనామా లేఖలను సమర్పించారు. వారిలో ముఖ్యంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు(Planning Commission Vice Chairman) బోయినపల్లి వినోద్ కుమార్ రాజీనామా చేయగా, వారితో పాటు వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు భరత్ కుమార్, జూలూరి గౌరీ శంకర్, పల్లె రవి కుమార్ గౌడ్, ఆంజనేయ గౌడ్, దూది మెట్ల బాలరాజు యాదవ్, గూడూరు ప్రవీణ్, అనిల్ కూర్మాచలం, వలియా నాయక్, వై. సతీశ్ రెడ్డి, మేడె రాజీవ్ సాగర్, రవీందర్ సింగ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, పాటిమీది జగన్మోహన్ రావు తదితరులు తమ రాజీనామా లేఖలను సీఎస్ శాంతికుమారికి సమర్పించారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీగా ఉన్న ప్రభాకర్‌రావు రాజీనామా చేశారు. మరోవైపు టాస్క్‌పోర్స్ ఓఎస్డీ రాధాకిషన్ రావు కూడా తన పదవికి రాజీనామా చేశారు. శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ సైతం రాజీనామా చేసి సీఎస్‌కు లేఖ పంపారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులుగా ఉన్న కేవీ రమణాచారి తన పదవులకు రాజీనామా చేశారు.
రాష్ట్రంలో పలువురు కార్పొరేషన్ల ఛైర్మన్ల రాజీనామాలు - సీఎస్‌కు లేఖలు
CM KCR Resigned : ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా - గవర్నర్ తమిళిసై ఆమోదం