హైదరాబాద్ మాదాపూర్ హెచ్ఐసీసీలో 12వ ఆసియా పసిఫిక్ మైక్రోస్కోపీ సదస్సును గవర్నర్ తమిళిసై ప్రారంభించారు. సునిశిత పరిశీలన, శోధనకు మైక్రోస్కోప్‌లు ఉపయోగపడతాయని తెలిపారు.
కంటికి కనిపించని వాటిని విజువలైజ్ చేసే పరిజ్ఞానం మైక్రోస్కోపిస్టులదేనని తమిళిసై అన్నారు. మైక్రోస్కోప్ సాంకేతికతతో ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించిందని, మరెన్నో ఆవిష్కరణలకు దోహదం చేశాయని తెలిపారు. దేశీయ మైక్రోస్కోప్‌ల తయారీ పెరగాలని గవర్నర్ ఆకాంక్షించారు.
- ఇదీ చదవండి:చీమలు గీసిన రూపం.. 'చిండీ మాత' ఆలయం!