ETV Bharat / state

నగర శివార్లలో భారీ టౌన్‌షిప్‌ల నిర్మాణం..

author img

By

Published : Nov 6, 2020, 3:22 PM IST

నానాటికి పెరుగుతోన్న హైదరాబాద్ జనాభా అవసరాలను తట్టుకునేందుకు... నగర శివార్లలో భారీ సంయుక్త టౌన్‌షిప్‌ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రాఫిక్‌ సమస్యతోపాటు కాలుష్యం, ఇతర మౌళిక సదుపాయాల సమస్య నుంచి బయట పడేందుకు... కాలినడకన కార్యాలయాలకు వెళ్లేలా గృహ, కార్యాలయాలు, వాణిజ్య సదుపాయాలు ఒకే టౌన్‌షిప్​లో ఉండేలా ఈ నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు.

telangana-governments-planning-for-best-integrated-townships-in-hyderabad
ఇంటిగ్రేటెడ్​ టౌన్​షిప్​... ఇక్కడ అన్ని సదుపాయాలు ఉండబడును

మెట్రో నగరాల్లో ట్రాఫిక్ అనేది ప్రధాన సమస్య. కార్యాలయం ఒక చోట ఉంటే... నివాసం పదుల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీంతో ఉదయం, సాయంత్రం సమయంలో తీవ్రమైన ట్రాఫిక సమస్య ఎదురవుతోంది. ఇక వర్షాలు, వరదలు ఇతర విపత్తులు వచ్చినప్పుడు ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది.

మౌలిక సదుపాయాలతో..

ఔటర్ రింగురోడ్డు పరిసరాల్లో, రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాల్లో శాటిలైట్ టౌన్​షిప్​ల ఏర్పాటుకు వీలుగా ఇంటిగ్రేటెడ్ టౌన్​షిప్ పాలసీ రూపొందిస్తోంది. దీంతో నివాస ప్రాంతాలు, వ్యాపార వాణిజ్య ప్రాంతాలు, కార్యాలయాలు అన్ని ఒకే దగ్గర అందుబాటులోకి రానున్నాయి. ఆయా ప్రాంతాల్లో రోడ్లు, తాగు నీరు, మురుగు నీటి పారుదల సౌకర్యాలు, విద్యుత్తు, విద్యా, వైద్య సదపాయాలు, కమ్యూనిటీ హాళ్లు వంటి మౌలిక సదుపాయాల రూపకల్పనతో మెరుగైన పరిస్థితులు ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు.

ఆదర్శంగా..

ఎక్కువ ఖాళీ స్థలాలు, వాటిలో పచ్చదనం, తక్కువ ట్రాఫిక్ సమస్యలు ఉండేట్టుగా ఇంటిగ్రేటెడ్ టౌన్​షిప్ పాలసీ ఉండనుంది. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఈ పాలసీని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో ఇప్పటివరకు కేవలం మహారాష్ట్ర, గుజరాత్​లోనే ఇంటిగ్రేటెడ్ టౌన్​షిప్ పాలసీ ప్రక్రియ అమలులో ఉంది. పట్టణ జనాభాలో ప్రధానంగా యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలలో కాలం విలువను గుర్తిస్తూ తక్కువ ప్రయాణ సమయానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. క్రేడాయ్, ట్రేడాయ్ వంటి సంస్థలతోపాటు రియల్ ఎస్టేట్ వర్గాలు సైతం ఇంటిగ్రేటెడ్ టౌన్​షిప్​లను ప్రోత్సాహించాలని కోరుతున్నాయి. వీటి ద్వారా ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాలలో మరిన్ని మౌలిక సదుపాయాలు ఉంటాయంటున్నారు.

వెసులుబాటు కల్పిస్తూ..

ఈ పాలసీతో పట్టణ ప్రాంతాలు, నగరాలలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించవచ్చు. ఉద్యోగులు, ప్రజలు తమ అవసరాల కోసం టౌన్​షిప్​ను దాటి బయట దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. హెచ్ఎండీఏ పరిధిలో 100 ఎకరాలు, జీహెచ్ఎంసీ పరిధిలో 50 ఎకరాలు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో 50 ఎకరాలను ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్​లలో... 40 శాతం ఏరియా మౌలిక సదుపాయాలకు కేటాయించడం, 10 శాతం గ్రీనరీ, రోడ్లు, ఎస్టీపీలు, విద్యుత్ ఉప కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ల్యాండ్ యూస్ రెగ్యూలరైజేన్ నిబంధనల నుంచి వెసులుబాటు అటవీ, వాటర్ బాడీలు మినహా, అభివృద్ధి చేసిన టౌన్​షిప్​లో డెవలపర్ పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించినట్లయితే అలాంటి వారికి డెవలప్​మెంట్ ఛార్జీలలో 75శాతం వరకు వెసులుబాటు అవకాశం ఇవ్వనున్నారు.

ప్రభుత్వ స్థలాలకు పూర్తి స్థాయిలో పరిరక్షణ చర్యలు ఇందులో ఉండనున్నాయి. వాటిల్లో 10 శాతం మించకుండా మార్కెట్ ధర ప్రకారం కేటాయింపులు ఉండనున్నాయి. ఇంటిగ్రేటెడ్ టౌన్​షిప్​లకు మొదటి 5 ఏళ్లు స్థానిక మునిసిపాలిటీలు ఆస్తి పన్నుల్లో 50 శాతం రాయితీ కల్పించనున్నారు. నివాసాలకు డెవలప్​మెంట్ ఛార్జీలు, ఇతర ఛార్జీలలో 100 శాతం మినహయింపులు ఉంటాయి. 300 ఎకరాల ఇంటిగ్రేటెడ్ టౌన్​షిప్​లో ఎంఐజీ గృహాలకు 50 శాతం, 300 ఎకరాలకు మించిన వాటిలో 75 శాతం సదుపాయం ఉంటుంది.

ఇదీ చూడండి: రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.