Telangana Government Stops Sanctioned Works Before Elections : కేసీఆర్ సర్కార్ ఎన్నికలకు ముందు ఇచ్చిన మంజూరీలు, టెండర్లపై రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) దృష్టి సారించింది. శాసనసభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తెలంగాణ వ్యాప్తంగా మెజార్టీ నియోజకవర్గాల్లో వివిధ పనుల కోసం మంజూరీలు ఇచ్చారు. ఆయా శాఖలతో పాటు ముఖ్యమంత్రి వద్ద ఉండే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక నిధి - ఎస్డీఎఫ్ నుంచి కూడా పెద్ద ఎత్తున పనులు మంజూరు చేశారు.
కొన్ని నియోజకవర్గాల్లో వందల కోట్లకు పైగా పనులు : కొన్ని నియోజకవర్గాల్లో వందల కోట్లకు పైగా, ఈ తరహా పనులు మంజూరయ్యాయి. అందులో కొన్ని పనులు ప్రారంభమై వివిధ దశల్లో ఉండగా, మరికొన్ని ప్రారంభం కాలేదు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ గెలుపొంది, కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరుణంలో పరిస్థితులు మారిపోయాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా సర్కార్ ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన వివిధ పనుల మంజూరీలు, ఇంకా ప్రారంభం కాని పనులను ఆపివేయాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
Sanctioned Works Before Elections Stopped in Telangana : ఈ మేరకు ప్రణాళికా శాఖ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక అభివృద్ధి నిధి కింద మంజూరైన పనులు, వాటి ప్రస్తుత స్థితి, ఇప్పటివరకు చేసిన వ్యయం, ఇంకా అవసరమయ్యే ఖర్చు, తదితరాల వివరాలు పంపాలని ఆదేశించింది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు మంజూరైన పనులు, ప్రారంభం కాని అన్నింటినీ ఆపివేయాలని అందులో స్పష్టం చేసింది.
ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేయండి - అధికారులతో జూపల్లి
తెలంగాణ సివిల్ సప్లై కార్పొరేషన్ మొత్తం అప్పులు రూ.56వేల కోట్లు : ఉత్తమ్
ఎన్నికలకు ముందు పిలిచిన టెండర్లన్నింటిని ఆపివేయాలని, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అధికారులు, ఇంజినీర్లను ఆదేశించారు. వర్క్ అలాట్ అయి పనులు ప్రారంభించనవి కూడా నిలిపివేయాలని స్పష్టం చేశారు. సమగ్ర సమీక్ష అనంతరం, అవసరాలు, ఆర్థిక పరిమితులను దృష్టిలో ఉంచుకొని తదుపరి కార్యాచరణ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తుమ్మల - మూడు ఫైళ్లపై సంతకం
ఇటీవలే సాగునీటి ప్రాజెక్టుల విషయంపై అధికారులతో, రాష్ట్ర మంత్రులు సమీక్ష నిర్వహించారు. కేసీఆర్ ప్రభుత్వం అవలంభించిన విధానాలు, అధికారుల వైఖరిపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రీ డిజైనింగ్ పేరిట అంచనాలను భారీగా పెంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, అదనంగా ఎకరా ఆయకట్టైనా పెరగలేదని ఆరోపించారు. ఎన్నికలకు ముందు నీటి పారుదల శాఖలో పిలిచిన టెండర్లు, కేటాయించిన పనులను వెంటనే నిలిపివేయాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఆదేశాలు జారీ చేశారు. రెండేళ్లలోపు పూర్తయ్యే ప్రాజెక్టులను గుర్తించి, కావాల్సిన వ్యయంపై వెంటనే నివేదికలు ఇవ్వాలని సూచించారు.
త్వరలో భారీ ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు - సీఎస్, నిఘా అధిపతితో సీఎం సుదీర్ఘ భేటీ!
'మేడిగడ్డ' ఘటనలో ఊహించని ట్విస్ట్ - పునరుద్ధరణ బాధ్యత ప్రభుత్వానిదే అంటూ నిర్మాణ సంస్థ లేఖ