ETV Bharat / state

భాగ్యనగర రోడ్లకు మహర్దశ.. ప్రణాళికతో ముందుకెళ్తున్న ప్రభుత్వం..

రహదారులను ప్రగతికి చిహ్నాలుగా భావిస్తుంటారు. మంచి ప్రమాణాలు, నాణ్యతతో కూడిన రహదారులుంటే.. ఏ నగరమైనా వేగంగా అభివృద్ది సాధిస్తుంది. ముఖ్యంగా కోట్ల మంది ప్రజలకు నివాసంగా ఉన్న భాగ్యనగరంలో నాణ్యమైన రోడ్లు ఎంతో ముఖ్యం. రోడ్ల తీరు, ట్రాఫిక్‌ సమస్యలు వంటి వన్నీ పరోక్షంగా పెట్టుబడులను నిర్దేశిస్తుంటాయి. అందుకే... తరాలుగా రహదారుల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న భాగ్యనగర.. గతి రేఖల్ని మార్చేందుకు.. తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రయత్నం చేస్తోంది. పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని.. వ్యూహాత్మక రహదారులను అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టింది. ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు.. ప్లైఓవర్లు, అండర్ పాస్​లు, లింక్ రోడ్లు పెద్ద ఎత్తున నిర్మిస్తోంది. వీటితో పాటు ఎలివేటెడ్ కారిడార్లు, రోడ్డు విస్తరణ కార్యక్రమాలు చేపట్టింది.

telangana government roads developments in greater hyderabad
భాగ్యనగర రోడ్లకు మహర్దశ.. ప్రణాళికతో ముందుకెళ్తున్న ప్రభుత్వం..
author img

By

Published : Nov 21, 2020, 9:57 PM IST

హైదరాబాద్‌ రోడ్లపై రోజు లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో కూడళ్లల్లో విపరీతంగా ట్రాఫిక్‌ ఏర్పడుతుంది. ఇక్కడ వాహనాల సరాసరి వేగం కూడా చాలా తక్కువ. వాహనాల రద్దీతో భాగ్యనగరంలోని చాలా రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని రోడ్లపై ప్రయాణం.. నరకాన్ని తలపిస్తుందని వ్యాఖ్యలూ ప్రజల నుంచి వినిపిస్తుంటాయి. ఈ పరిస్థితి.. నిన్నమొన్న ఏర్పడింది కాదు.. ఏళ్లుగా ఇక్కడి రోడ్ల స్థితిగతులు ఇలానే ఉంటున్నాయి. కానీ స్వరాష్ట్రం సిద్ధించాక.. రాష్ట్రాభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికలు రచించింది ప్రభుత్వం. దానికి తోడు.. ప్రపంచ స్థాయిలో దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు.. ఇక్కడి ట్రాఫిక్‌, రోడ్ల తీరు ప్రభావం చూపుతాయని గుర్తించింది. అందుకే.. రోడ్లను పూర్తిగా మార్చివేసేందుకు.. ప్రణాళికలు రచించింది.

హైదరాబాద్ సర్వతోముఖాభివృద్ధి కోసం 67,035.16 కోట్ల నిధులు

విశ్వనగరం స్థాయికి తగ్గట్టుగా.. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించింది. గడిచిన ఆరేళ్లలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సర్వతోముఖాభివృద్ధి కోసం 67,035.16 కోట్ల మేర నిధులను ఖర్చు చేసింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే మౌలికవసతులు, సౌకర్యాల మెరుగుదల కోసం రూ. 32,532 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో దాదాపు 80 శాతం నిధులను ఫ్లైఓవర్లు, అండర్​పాస్​లు, రోడ్లు, పేదల రెండు పడకల ఇళ్ల కోసం వినియోగించారు. రద్దీగా ఉండే ప్రధాన రహదారులు, వ్యాపార-వాణిజ్య కార్యకలాపాలు అధికంగా ఉన్న మార్గాలను ఎస్ఆర్​డీపీ కింద ఎంపిక చేశారు. ఇందులో భాగంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, కూకట్‌పల్లి, బాచుపల్లి, పటాన్‌చెరువు, ఆబిడ్స్, చార్మినార్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, శంషాబాద్ విమానాశ్రయం, ఉప్పల్, సికింద్రాబాద్, ఈసీఐఎల్, అల్వాల్, కొంపల్లి, జీడిమెట్ల తదితర ప్రాంతాలను అభివృద్ధి చేశారు. నిధుల లభ్యత, తక్కువ భూసేకరణ అవసరమైన కారిడార్లకు ప్రాధాన్యతనిస్తూ ఐదు దశల్లో జీహెచ్ఎంసీ పనులను చేపట్టింది.

ఎస్ఆర్​డీపీలో భాగంగా రూ.1,010.77 కోట్లతో చేపట్టిన 18 ప్రాజెక్టులు

అభివృద్ధి పనుల్లో ప్రధానంగా రోడ్లు, ట్రాఫిక్ సమస్యకు అధిక ప్రాధాన్యమిస్తూ వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక(ఎస్ఆర్‌డీపీ), సమగ్ర రోడ్ల నిర్వహణ ప్రణాళిక(సీఆర్ఎంపీ) పథకాలను చేపట్టారు. ఎస్ఆర్​డీపీ కింద పెద్ద ఎత్తున ఫ్లైఓవర్లు, అండర్​పాస్​లను నిర్మించారు. మొత్తం 46 ప్రాంతాల్లో ప్లైఓవర్ల నిర్మాణం చేపట్టారు. మరికొన్ని పురోగతిలో ఉన్నాయి. అదనంగా 46 జంక్షన్ల అభివృద్ధి పనులు చేపట్టారు. వీటికి మొత్తం రూ 8,410 కోట్లు ఖర్చు చేశారు. రోడ్ల ఏర్పాటు, రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాలకు రూ 5,043 కోట్లు ఖర్చు చేశారు. రహదారుల స్థితిగతులను మెరుగుపరిచే ఉద్దేశంతో ప్రధాన రోడ్ల నిర్వహణ బాధ్యతలను సీఆర్ఎంపీ కింద ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించారు. మొదటి దశలో 709 కిలోమీటర్ల మేర రహదారుల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించగా, ఐదేండ్లపాటు వాటి నిర్వహణ కోసం రూ 1,839 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు ఎస్ఆర్​డీపీలో భాగంగా రూ.1,010.77 కోట్లతో చేపట్టిన 18 ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తిచేశారు. ఇందులో 9 ప్లైఓవర్లు, 4 అండర్​పాస్​లు, 3ఆర్వోబీ/ఆర్​యూబీతో పాటు ఓ కేబుల్ బ్రిడ్జ్, మరో వంతెన నిర్మాణాలు ఉన్నాయి. మరో రూ.4,780 కోట్లతో చేపట్టిన పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి.

184 కోట్లతో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి

అయ్యప్ప సొసైటీ జంక్షన్ అండర్​పాస్ రూ.49.69 కోట్లు, మైండ్ స్పేస్ జంక్షన్ గ్రేట్ సపరేటర్ ప్లైఓవర్ రూ.131.64 కోట్లతో, చింతలకుంట చెక్ పోస్టు అండర్ పాస్ రూ.13.25 కోట్లు, కామినేని జంక్షన్ రూ.23.20 కోట్లు, ఎల్బీనగర్ జంక్షన్​లో గ్రేడ్ సెపరేటర్, ఫ్లైఓవర్ రూ.20.74 కోట్లు, వెస్ట్ జోన్ పరిధిలో రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్ వద్ద గ్రేడ్ సెపరేటర్, ఫ్లైఓవర్ రూ.97.94 కోట్లు, బయోడైవర్సిటీ జంక్షన్ లెవల్ -2 గ్రేడ్ సెపరేటర్ / ఫ్లైఓవర్ రూ.69.47 కోట్లు, బయోడైవర్సిటీ జంక్షన్ లెవల్ -1 గ్రేడ్ సెపరేటర్, ఫ్లైఓవర్ కు రూ.30.26 కోట్లు, ఎల్బీనగర్ జంక్షన్ వద్ద అండర్ పాస్ రూ.17.07కోట్లు, పంజాగుట్ట శ్మశానవాటిక స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి రూ.5.96 కోట్లు, ఉప్పుగూడ రోడ్ అండర్ బ్రిడ్జి రూ.20.27 కోట్లు, బైరామల్ గూడ ప్లైఓవర్ రూ.38.18 కోట్లు, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి దుర్గంచెరువు వరకు నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ కు రూ.150 కోట్లు, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి రూ.184 కోట్లు, లాలాపేట్ ఆర్​యూబీ ఆధునీకీకరణ కోసం రూ.5.85 కోట్లు, ఉత్తమ్​నగర్ ఆర్‌యూబీ రూ. 29.39 కోట్లతో నిర్మాణ పనులు పూర్తిచేశారు.

8,410 కోట్లు వ్యయం చేయాలని నిర్ణయిం

మౌలిక వసతుల మెరుగుదల, జీవన ప్రమాణాల పెంపే లక్ష్యంగా జీహెచ్ఎంసీ ద్వారా రూ.32,532 కోట్లను అభివృద్ధి కోసం వెచ్చించారు. ఇందులో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక (ఎస్ఆర్‌డీపీ)-రూ. 8,410 కోట్లు వ్యయం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 46 ఫ్లైఓవర్లు, 7అండర్ పాస్​లు, 4 ఆర్వోబీలు, 5 రోడ్డు అండర్ బ్రిడ్జ్​లు, 46 జంక్షన్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సమగ్ర రహదారుల నిర్వహణ ప్రాజెక్టు(సీఆర్ఎంపీ) కింద రూ .1,839 కోట్లు కేటాయించి..709.490 కిలోమీటర్లు వాన నీటి డ్రెయిన్లను రూ.589.40 కోట్లతో నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారు. జేబీఎస్ నుంచి తూంకుంట, నాగపూర్ హైవే పై కూడా ఎలివేటెడ్ కారిడార్​లు నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం రూ.5 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇందిరాపార్క్ నుంచి వీఎస్​టీ, రాంనగర్ నుంచి బాగ్​లింగంపల్లి రూ.426 కోట్ల అంచనా వ్యయంతో రోడ్డు నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. నిర్వహణ పనులు కొనసాగుతున్నాయి.

ఇదీ చదవండి: జీహెచ్​ఎంసీలో తెరాస హామీలపై రేపు ఛార్జ్​షీట్​ విడుదల: కిషన్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.