ETV Bharat / state

లాక్​డౌన్​ మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం - తెలంగాణ లాక్​డౌన్​ మార్గదర్శకాలు

కరోనా కట్టడిలో భాగంగా లాక్​డౌన్​ను ఈ నెల 31 వరకు పొడిగించిన ప్రభుత్వం.. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. సడలింపులతో కూడిన ఆంక్షలుంటాయని స్పష్టం చేసింది. రాత్రి కర్ఫ్యూ ఉంటుందని పేర్కొంది.

telangana logo
author img

By

Published : May 19, 2020, 1:52 PM IST

కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఈ నెల 31 వరకు పొడిగించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. సడలింపులతో కూడిన ఆంక్షలు కొనసాగనున్నాయి. రాత్రి వేళల్లో యథావిధిగా కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. జీహెచ్‌ఎంసీ పరిధి మినహా జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాల రాకపోకలు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

మాస్కులు తప్పనిసరి

రెస్టారెంట్లలో కేవలం పార్శిళ్లను మాత్రమే అనుమతించింది. సెలూన్లు, స్పా కేంద్రాలు తెరుచుకునే అవకాశం కల్పించింది. అయితే విధిగా మాస్కులు, చేతికి గ్లౌజులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది. క్యాబ్‌, ఆటోలు నడుపుకోవచ్చు, ట్యాక్సీ, క్యాబుల్లో ముగ్గురు ప్రయాణికులకు మాత్రమే ప్రయాణించాలి, ఆటోలో ఇద్దరు మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రయాణికులంతా మాస్కులు తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది.

జీహెచ్​ఎంసీలో సరిబేసి విధానం

సరిబేసి విధానం ద్వారా జీహెచ్‌ఎంసీ పరిధిలోని దుకాణాలు తెరుచుకోవచ్చు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సరిబేసి విధానం అమలు ఇతర ఏర్పాట్లు పరిశీలించనున్నారు. దేశీయ అంతర్జాతీయ విమానాల రాకపోకలు ఉండవు. మెట్రో రైలు కూడా నడవదని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. బార్లు, పబ్‌లు, సినిమా థియేటర్లు, ఈత కొలనులు, షాపింగ్‌ మాల్స్‌, జిమ్‌లు, జూ వంటి వాటిని తెరవడానికి అనుమతి లేదు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు ఇవాళ్టి నుంచి అమల్లో ఉండనున్నాయి.

ఇదీ చదవండి: రాష్ట్రంలో మే 31 వరకు లాక్‌డౌన్‌ : సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.