land Regularization : భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. జీవో నంబర్ 59 ద్వారా భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల విధివిధానాల్లో మార్పులు తీసుకొచ్చింది. మొదటి వాయిదాగా చెల్లించాల్సిన 12.5 శాతాన్ని దరఖాస్తు సమయంలో చెల్లించాల్సిన అవసరం లేదని రెవెన్యూ శాఖ స్పష్టం చేసింది. అయితే ప్రాసెసింగ్ రుసుం కింద దరఖాస్తు సమయంలో రూ.1000 చెల్లించాల్సిందేనని తెలిపింది.
58, 59 జీఓలకు అనుగుణంగా వివాదాలు, సమస్యలు లేని ప్రభుత్వ, యూఎల్సీ, ఇతర భూముల క్రమబద్ధీకరణ కోసం మార్చి నెలాఖరు వరకు అన్ని మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, ఆ స్థలం తమ అధీనంలో ఉన్నట్లు ఏదైనా ధ్రువపత్రం, స్థలం ఫొటోను జతపర్చి దరఖాస్తు చేసుకోవాలని రెవెన్యూశాఖ తెలిపింది.
ఇదీ చూడండి : CM KCR National Politics: 'దేశం బాగుకోసమే జాతీయ రాజకీయాల్లోకి'