ETV Bharat / state

కృష్ణా జలాల తరలింపును నిలిపివేయండి.. తుంగభద్ర బోర్డుకు ప్రభుత్వం లేఖ - తుంగభద్ర బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ

Telangana Government letter to Tungabhadra Board: ట్రైబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా కృష్ణా జలాలను కేసీ కెనాల్​కు తరలించాలని ఆంధ్రప్రదేశ్‌ భావిస్తోందని తుంగభద్ర బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కేసీ కెనాల్ ఆయకట్టుకు సుంకేశుల ఆనకట్ట ద్వారా తుంగభద్ర జలాలను మాత్రమే వినియోగించాలని రాష్ట్రం స్పష్టం చేసింది. కేసీ కెనాల్‌కు కృష్ణా జలాల తరలింపును నిలిపివేయాలని తెలంగాణ కోరింది.

Telangana Government letter to Tungabhadra Board

author img

By

Published : Feb 21, 2023, 5:35 PM IST

Telangana Government letter to Tungabhadra Board: ట్రైబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా కృష్ణా జలాలను కేసీ కెనాల్​కు తరలించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోందని... ఆ ప్రక్రియను నిలిపివేయాలని తుంగభద్ర బోర్డును తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఏపీపై ఫిర్యాదు చేస్తూ తుంగభద్ర బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది.

కేసీ కెనాల్ ఆయకట్టుకు సుంకేశుల ఆనకట్ట ద్వారా తుంగభద్ర జలాలను మాత్రమే వినియోగించాలన్న తెలంగాణ ప్రభుత్వం... తుంగభద్ర జలాలను తుంగభద్ర హైలెవెల్ కెనాల్​కు తరలించి శ్రీశైలం ద్వారా కృష్ణా జలాలను కేసీ కెనాల్​కు తరలించాలని భావిస్తోందని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలా కేసీ కెనాల్​కు కృష్ణా జలాల తరలింపు ట్రైబ్యునల్ తీర్పునకు విరుద్ధమని పేర్కొంది. ఇప్పటికే రెండు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తరలిస్తోందని... తాజాగా మరో రెండు టీఎంసీలు తరలించాలని ప్రయత్నిస్తోందని ఆక్షేపించింది.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రయత్నాలను నిలువారించాలని.. కేసీ కెనాల్​కు కృష్ణా జలాల తరలింపును నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు తుంగభద్ర బోర్డు కార్యదర్శికి తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. తక్షణమే దీనిపై స్పందించి తగినవిధంగా కృష్ణా జలాల కేటాయింపులు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం తుంగభద్ర బోర్డును లేఖలో కోరింది.

ఇదిలా ఉంటే ఫిబ్రవరి 17న హైదరాబాద్ జలసౌధలో జరిగిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ పలు వాదనలు వినిపించారు. ఈ నీటి సంవత్సరంలో కృష్ణా జలాల వినియోగం లెక్కలు తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం నదీ యాజమాన్య బోర్డును కోరింది. అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం ఎంత నీటిని వాడుకొన్నది.. ఎవరి వాటా ఎంత మిగిలి ఉందో తేలిపోతుందని పేర్కొంది. ఈ ఏడాది ఏపీ ఇప్పటికే వాటాకు మించి కృష్ణా జలాలను వాడుకుందన్న తెలంగాణ.. నీటి లెక్కల విషయంలో కఠినంగా ఉండాలని కోరింది. తెలంగాణకు ఇంకా 141 టీఎంసీల నీటి వినియోగానికి అవకాశం ఉందని ఆ మేరకు నీటిని వాడుకుంటామని ఈఎన్సీ మురళీధర్ పేర్కొన్నారు. మార్చి నెల మొదటివారంలో మరోమారు త్రిసభ్య కమిటీ సమావేశమయ్యే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.