ETV Bharat / state

'ఛత్తీస్‌గఢ్‌ లేకుండా ఆ సమావేశం భావ్యం కాదు' - ఈ నెల 6న ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశం

Telangana Government Letter To NWDA: జాతీయ జలాభివృద్ధి సంస్థకు తెలంగాణ ఈఎన్​సీ లేఖ రాసింది. గోదావరి-కావేరి అనుసంధానంపై అభిప్రాయాన్ని ఇప్పటికే చెప్పామన్న ప్రభుత్వం.. అందుకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. ఛత్తీస్‌గఢ్ కూడా నీటిని వాడుతుందన్న సర్కార్.. ఆ రాష్ట్రం లేకుండా సమావేశం భావ్యం కాదని అభిప్రాయపడింది.

National Water Development Corporation
National Water Development Corporation
author img

By

Published : Mar 3, 2023, 6:43 PM IST

Telangana Government Letter To NWDA: గోదావరి-కావేరీ అనుసంధానం కోసం ఛత్తీస్‌గఢ్ వాటాలోని 141 టీఎంసీలను వినియోగిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర ప్రాతినిథ్యం లేకుండా చర్చించడం సబబు కాదని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ నెల 6న హైదరాబాద్ జల సౌధలో ప్రతిపాదించిన టాస్క్ ఫోర్స్ సమావేశానికి ఛత్తీస్‌గఢ్‌ను ఆహ్వానించాలని కోరింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం తరఫున నీటి పారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ జాతీయ జలాభివృద్ధి సంస్థ చీఫ్ ఇంజినీర్‌కు లేఖ రాశారు.

గోదావరి-కావేరీ అనుసంధానానికి సంబంధించి.. తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాన్ని గతంలోనే స్పష్టం చేశామని.. అందుకు కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు. 6న జరిగే సమావేశానికి ఛత్తీస్‌గఢ్‌ను సభ్యులుగా, ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించలేదని లేఖలో పేర్కొన్నారు. అనుసంధానం కోసం ఆ రాష్ట్ర నీటి వాటాను వినియోగించుకుంటూ.. ఆ రాష్ట్రం లేకుండా చర్చలు అర్థవంతం కాదని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో ఛత్తీస్‌గఢ్‌ను సోమవారం జరిగే సమావేశానికి ఆహ్వానించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.

గతంలోనూ పలుమార్లు తెలంగాణ ప్రభుత్వం జాతీయ జలాభివృద్ధి సంస్థకు పలు అంశాలపై లేఖలు రాసింది. ముఖ్యంగా గోదావరి-కావేరి నదుల అనుసంధానం విషయంలో ఆ సంస్థ తీసుకుంటున్న నిర్ణయాలపై తెలంగాణ ఈఎన్​సీ తన అభిప్రాయాలు లేఖల ద్వారా వ్యక్తం చేసింది. 2022 నవంబర్​లోను నదుల అనుసంధానం గురించి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. అప్పుడు మొదటగా మహానది- గోదావరి నదుల అనుసంధానం పూర్తయ్యాకే గోదావరి-కావేరి లింక్ చేపట్టాలని స్పష్టం చేసింది. అదే విధంగా కొన్ని అంశాలను ప్రభుత్వం ప్రస్తావించింది.

ఇచ్చంపల్లి వద్ద ఆనకట్ట నిర్మించాలని ఉమ్మడి ఏపీలోనే ప్రతిపాదించారని.. అయితే తమ రాష్ట్రాల్లో ముంపు సమస్య వస్తుందని ఆనాడే మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్ అభ్యంతరం తెలిపాయని ప్రభుత్వం పేర్కొంది. ప్రతిపాదిత ఇచ్చంపల్లి ఛత్తీస్​గఢ్ సరిహద్దుకు సమీపాన ఉండడంతో మళ్లీ అక్కడి నుంచి అభ్యంతరం రావచ్చని తెలిపింది. ఇచ్చంపల్లి దిగువన తెలంగాణ రాష్ట్రానికి 158 టీఎంసీల మేర నీటి అవసరాలు ఉన్నాయని.. అదే ఆనకట్ట కడితే వాటిపై ఆ ప్రభావం పడుతుందని సర్కార్ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర అవసరాలు తీరాకే నీటి మళ్లింపు జరగాలని ఆనాడే స్పష్టం చేసింది.

ఇలా కొన్ని అభ్యంతరాల నేపథ్యంలో మహానది - గోదావరి నదుల అనుసంధానం పూర్తయ్యాక.. లేదా పనులు వేగవంతం అయ్యాక మాత్రమే గోదావరి - కావేరీ నదుల లింక్ అంశాన్ని ప్రతిపాదించవచ్చని తెలిపింది. ఈ క్రమంలో నదుల అనుసంధాన ప్రతిపాదనలు ఖరారు చేసే సమయంలో ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని జాతీయ జలాభివృద్ధి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.