ETV Bharat / state

Telangana Government Letter To KRMB : హంద్రీనీవా సుజలస్రవంతి పనులు ఆపించండి.. కేఆర్​ఎంబీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ - కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Government Letter To KRMB : ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం హంద్రీనీవా సుజలస్రవంతి విస్తరణ పనులు చేపడుతోందని.. వాటిని నిలువరించాలని కేఆర్ఎంబీను తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ కేఆర్ఎంబీ ఛైర్మన్​కు లేఖ రాశారు.

Telangana Government Letter To KRMB
Telangana Government
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 27, 2023, 9:26 PM IST

Telangana Government Letter To KRMB : ఎలాంటి అనుమతుల్లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంద్రీనీవా సుజలస్రవంతికి సంబంధించిన విస్తరణ పనులు చేపడుతోందని.. నిలువరించాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు(Krishna River Management Board)ను తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కృష్ణా నది యాజమాన్య బోర్డు ఛైర్మన్​కు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ లేఖ రాశారు. రాయదుర్గం నియోజకవర్గంలోని 58 చెరువులు నింపేందుకు భైరవానితిప్ప ప్రాజెక్టు నుంచి నీటీని ఎత్తిపోసేలా సర్వే, లెవలింగ్ పనులకు ఏపీ ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ ఇచ్చిందని అందులో పేర్కొన్నారు.

Telangana Water Board Complaint To Central Board : ఏపీ ప్రభుత్వం చేపట్టబోయే ఈ పనులన్నీ విభజన చట్టాన్ని ఉల్లంఘించడమేనన్న తెలంగాణ.. అనుమతుల్లేకుండా ప్రధాన ప్రాజెక్టు విస్తరణ పనులను కూడా కొనసాగిస్తున్నారని తెలిపారు. కేంద్ర జలసంఘం, కృష్ణా బోర్డు ఆమోదం లేకుండా హంద్రీనీవా సుజలస్రవంతి ప్రాజెక్టుపై కొత్త ఎత్తిపోతల పథకాలతో విస్తరణ చేపట్టకుండా నిలువరించాలని తెలంగాణ బోర్డును కోరింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రిత్వశాఖ దృష్టికి కూడా తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేసింది.

KRMB Meeting in Hyderabad : కృష్ణా జలాలను పొదుపుగా వాడుకోండి.. తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ సూచన

Telangana Government Letter To Krishna Board : అలాగే మరోవైపుఇటీవలే ఎలాంటి అనుమతులు లేకుండా వెలిగొండ ప్రాజెక్టు(Veligonda Project)పై ఎత్తిపోతలు, ఇతర కాంపొనెంట్ పనులు చేపట్టకుండా ఏపీ ప్రభుత్వాన్ని నిలువరించాలని కేఆర్ఎంబీను తెలంగాణ ప్రభుత్వం కోరింది. అపెక్స్ కౌన్సిల్, బోర్డు అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం కొత్త పనులకు అనుమతులు ఇచ్చిందని కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్(TS Irrigation Department ENC Muralidhar) కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు లేఖ రాశారు. ఎలాంటి అనుమతులు లేకుండా వెలిగొండ ప్రాజెక్టుపై ఎత్తిపోతలు, ఇతర కాంపొనెంట్ పనులకు పరిపాలనా అనుమతులు ఇచ్చారని అందులో పేర్కొన్నారు.

Telangana and Andhra Pradesh Water Issue : అనుమతులు లేకుండా బేసిన్ వెలుపలకు కృష్ణా జలాలను తరలించడం తగదన్న తెలంగాణ.. కేంద్ర జల శక్తి శాఖ ఆదేశాలను పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Government) పనులు చేపడుతోందని ఆక్షేపించింది. వెలిగొండ లాంటి ప్రాజెక్టుల పనులతో తెలంగాణ ప్రాజెక్టులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని.. ఫ్లోరైడ్ ప్రభావిత నల్గొండ, కరువు పీడిత ప్రాంతమైన పాలమూరుకు అన్యాయం జరుగుతోందని లేఖలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అనుమతి లేని వెలిగొండ ప్రాజెక్టు, కొత్త కాంపొనెంట్ పనులను ఏపీ చేపట్టకుండా నిలువరించాలని కృష్ణా బోర్డును లేఖలో ప్రభుత్వం కోరింది.

Telangana Govt Letter to KRMB : రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలిపేలా చర్యలు తీసుకోవాలి.. కేఆర్​ఎంబీకి ప్రభుత్వం లేఖ

TS Water Board Letter To Krishna Board : వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం ఆపించాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.