ETV Bharat / state

బతుకమ్మ చీరలు వచ్చేది అప్పుడే..

రాష్ట్రంలో నేత కార్మికులకు ఉపాధి, కోటి మంది పేద మహిళలకు ఉచిత పంపిణీ కోసం చేపట్టిన బతుకమ్మ చీరల ఉత్పత్తి గడువును రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు వరకు పొడిగించింది. గతంలో ఈ గడువు ఆగస్టు వరకు ఉండగా లాక్‌డౌన్‌ కారణంగా ఉత్పత్తి నెలన్నర నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో సర్కారు తాజా నిర్ణయం తీసుకుంది.

telangana-government-has-decided-to-distribute-bathukamma-sarees-from-september-2020
బతుకమ్మ చీరలు వచ్చేది అప్పుడే
author img

By

Published : May 25, 2020, 7:38 AM IST

కోటి మంది పేద మహిళలకు ఉచిత పంపిణీ కోసం చేపట్టిన బతుకమ్మ చీరుల ఉత్పత్తి... రూ.318 కోట్లతో ఈ ఏడాది జనవరి నుంచే సిరిసిల్లలో ప్రారంభమైంది. గతంలో మార్చి నుంచి ఉత్పత్తి ప్రారంభించి, బతుకమ్మ పండుగ నాటికి చీరలను పంచేవారు. ఈసారి ముందుగా పంపిణీ చేయాలనే ఉద్దేశంతో రెండు నెలల ముందు నుంచే ఉత్పత్తి చేపట్టారు. మొదట్లో అయిదు వేల మరమగ్గాలతో పనులు ప్రారంభమయ్యాయి. మార్చి నాటికి అవి ఆరు వేలకు చేరాయి. పూర్తిస్థాయిలో ఎనిమిది వేల మగ్గాలతో పనులు ప్రారంభం కావాల్సి ఉండగా... లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 22 నుంచి ఉత్పత్తి నిలిచిపోయింది.

అన్ని అందుబాటులో ఉన్నాయి...

లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన తర్వాత మళ్లీ ఈ నెల ఏడో తేదీ నుంచి ఉత్పత్తి పునఃప్రారంభమైంది. క్రమేపీ పుంజుకుంటోంది. ప్రస్తుతం ఆరువేల మగ్గాలు నడుస్తున్నాయి. రోజూ 30 వేల చీరలు తయారవుతున్నాయి. ఎనిమిది వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. జూన్‌ 15 నాటికి మగ్గాలను పెంచి ప్రతి రోజూ లక్ష చొప్పున చీరలను తయారు చేయించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. చీరలకు అవసరమైన నూలు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. కార్మికులంతా సిరిసిల్లతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన వారే. ఉత్పత్తి ప్రారంభమయ్యాక వారంతా విధుల్లో చేరుతున్నారు.

పంపిణీకి కొత్త ప్రణాళిక

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పంపిణీకి ప్రభుత్వం కొత్త ప్రణాళిక రూపొందించనుంది. ఈ ఏడాది అక్టోబరు17న బతుకమ్మ పండుగ ఉండగా... గతంలో సెప్టెంబరు మాసాంతం నాటికి మహిళలకు చీరలందించాలని ప్రభుత్వం భావించింది. ఈ షెడ్యూలును ఇప్పుడు మారుస్తోంది. అక్టోబరు మొదటి వారం నుంచి పంపిణీ చేయాలని యోచిస్తోంది. అప్పటి వరకు కరోనా తీవ్రత తగ్గితే గతంలో మాదిరిగా రేషన్‌ దుకాణాల్లో, మహిళా సంఘాల ద్వారా పంపిణీ జరుపుతుంది. కరోనా ప్రభావం ఉంటే ఈ విధానం మార్చనుంది. బతుకమ్మ చీరల పంపిణీకి సంబంధించి మంత్రి కేటీఆర్‌ శనివారం సమీక్షించారు. చీరల తయారీ నేత కార్మికుల ఉపాధికి నిర్దేశించినందున వారికి పూర్తిస్థాయిలో పనులు కల్పించాలని, మరోవైపు ఉత్పత్తిలో వేగం పెంచాలని అధికారులను ఆయన ఆదేశించారు.

ఇవీ చూడండి: 'ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రాంగణాన్ని సీజ్​ చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.