ETV Bharat / state

Loan to Irrigation Projects: ఆ మూడు ప్రాజెక్టుల కోసం రూ.వెయ్యి కోట్ల రుణం! - loan to telangana irrigation projects

రాష్ట్రంలో మూడు నీటిపారుదల ప్రాజెక్టుల(Loan to Irrigation Projects)కు రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. వరదకాల్వ, దేవాదుల -తుపాకులగూడెం, సీతారామ ఎత్తిపోతల పథకాల కోసం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి రూ. వెయ్యి కోట్లు రుణంగా తీసుకునేందుకు అనుమతులు మంజూరు చేసింది.

telangana irrigation projects
తెలంగాణ నీటి పారుదల ప్రాజెక్టులు
author img

By

Published : Nov 24, 2021, 11:15 AM IST

Loan to Irrigation Projects: వరద కాల్వ(ఎఫ్‌ఎఫ్‌సీ-ఎస్సార్‌ఎస్పీ), దేవాదుల తుపాకుల గూడెం, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మాణాలకు బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర నుంచి రూ.వెయ్యి కోట్ల రుణం తీసుకునేందుకు రాష్ట్ర జలవనరుల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థకు (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఐడీసీఎల్‌) ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. వరద కాల్వకు రూ.265 కోట్లు, దేవాదుల తుపాకులగూడెం ప్రాజెక్టుకు రూ.265 కోట్లు, సీతారామ ఎత్తిపోతలకు రూ.470 కోట్ల నిధులు రానున్నాయి. ఈ మేరకు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.

కిస్తీల వారీగా

వరద కాల్వ, దేవాదుల తుపాకుల గూడెం రుణాన్ని 13 ఏళ్లలో, సీతారామ ప్రాజెక్టు రుణాన్ని 14 ఏళ్లలో కిస్తీల వారీగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులకు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సమాఖ్య నుంచి రూ.6,998.39 కోట్ల రుణం మంజూరు కానుంది. ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించిన కొన్ని పనులు పూర్తి చేసేందుకు ఈ నిధులను వినియోగిస్తారు.

ఇదీ చదవండి: TSRTC Single Day Income: ఒక్కరోజే టీఎస్​ఆర్టీసీకి రికార్డు స్థాయిలో రాబడి.. ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.