పల్లెప్రగతి పథకానికి నిధులు విడుదలయ్యాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి దఫాగా నిధులను విడుదల చేశారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా గ్రామీణ ప్రాంత స్థానికసంస్థలకు నిధులు విడుదల చేశారు.
మొత్తం 273 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. గ్రామపంచాయతీలకు 232.06 కోట్లు, మండల ప్రజాపరిషత్లకు 27.28 కోట్లు, జిల్లా ప్రజాపరిషత్లకు 13.63 కోట్ల రూపాయల విడుదలకు పరిపాలనా అనుమతులు ఇచ్చారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి: అధికారం శాశ్వతమనుకుంటే భ్రమలో ఉన్నట్లే : ఈటల